Andhra Pradesh: రెండు గ్రామలు మొత్తం ఖాళీ.. ఇళ్లకు తాళాలు వేసి.. రెండు ఊర్ల గ్రామస్తులు వలస ఉత్సవం
గ్రామానికి ఏ కీడు జరగకుండా, గ్రామమంతా ఐక్యంగా ఉండాలని ఆనవాయితీగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. గుడిపల్లి మండలం గుడి కొత్తూరు, వేపమాను కొత్తూరు గ్రామాలు ఈ ఆచారాన్ని పాటించాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వలస సంప్రదాయాన్ని పాటిస్తున్న గ్రామస్తులు పొద్దు పొడవక ముందే మూటా ముల్లి సర్దుకొని ఊరిని ఖాళీ చేశారు. దాదాపు 200 కు పైగా ఇళ్ళు ఉన్న ఈ రెండు గ్రామాల్లో వెయ్యి మంది దాకా జనాభా కూడా ఉండగా వింత ఆచారం నేటికీ పాటిస్తుండటం ఆసక్తిగా మారింది.
ఏపీలోని ఆ రెండు గ్రామాల ప్రజలు ఏళ్ల నాటి ఆచారం తూచతప్పకుండా పాటిస్తున్నారు. గ్రామాలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండేందుకు ఇళ్లకు తాళాలు వేసి సూర్యదయం రోజంతా గ్రామాలను వదిలేసి బ్రతుకుతున్నారు. భిన్న జాతులు, విభిన్న సంస్కృతులకు నిలయం భారతదేశం. ఏళ్ల నాటి ఆచార వ్యవహారాలను ఏపీలోని రెండు గ్రామాల ప్రజలు తూచతప్పకుండా పాటిస్తున్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడికొత్తూరు, వేపమాను కొత్తూరు గ్రామాలు ప్రతి ఐదేళ్లకు, పదేళ్లకు ఒకసారి ఊళ్లకు ఊళ్లే మాయం అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు గ్రామాల ప్రజలు.. ఐదేళ్లకు ఒకసారి మనుషులు, జంతువులతో సహా ఊరి బయటకు వచ్చి వనభోజనాలు చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలు, పశువులతో కలసి రెండు ఊళ్ల ప్రజలు ఊరు బయటకు వచ్చేస్తారు.
ఆయా గ్రామాల్లోకి ఇతరులు కూడా ఎవరు వెళ్లకుండా ముళ్ళకంచెలు వేస్తారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం వరకూ నిర్మానుష్యంగా ఉంటాయి గ్రామాలు. ఊరి బయట పొలాల్లో వనభోజనాలు చేసి.. ఊర్లకు ఎలాంటి కీడు జరగకుండా ఉండేందుకు దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి సూర్యుడు అస్తమించిన తర్వాత .. ముందుగా గ్రామ దేవతలు గ్రామంలోకి ప్రవేశించాక.. ఆపై గ్రామస్తులు ఇళ్లకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇక.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఊరంతా ఖాళీ చేసి.. కుల, మతాలకు అతీతంగా వలస వెళ్లే ఆనవాయితీ తాతముత్తాల నుంచి వస్తుందన్నారు గుడికొత్తూరు గ్రామస్తులు.
రెండు గ్రామాల్లోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా యూనిటీగా ఉండేందుకే ఒకరోజు వలస పోతుంటామని చెప్పారు గుడికొత్తూరు గ్రామ పెద్ద. చిత్తూరు జిల్లాలోని గుడికొత్తూరు, వేపమానుకొత్తూరు గ్రామాల ప్రజలు పూర్వీకుల ఆచారాలను గౌరవిస్తుండడం పట్ల ఆశ్చర్యంతోపాటు హర్షం వ్యక్తమవుతోంది. ఇళ్లకు తాళాలు వేసి.. రెండు ఊర్లు వలస ఉత్సవం జరుపుకునే ఆచారం ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..