AP News: మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం రెడీ.. అందులో ఆ కీలక వివరాలు
మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమయింది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ రోజు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు, సహాజ వనరులు..
మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమయింది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ రోజు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు, సహాజ వనరులు దోపిడీకి గురయ్యాయని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో భూ దందాలు, గనుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇందులో ప్రధానంగా విశాఖలో భూదోపిడీపై పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ ఫైల్స్ పేరుతో నివేదిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించడం కూడా ఆసక్తి రేపుతోంది.
వైరల్ వీడియోలు
Latest Videos