AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smell In Sweating: మీ చెమట కంపు వాసన వస్తోందా? అయితే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. ఈ వ్యాధి లక్షణం కావొచ్చు..

వేసవిలో గానీ, ఎండలో గానీ చెమటలు పట్టడం అందరికీ సహజమే. కానీ చెమట చాలా దుర్వాసనగా ఉంటే మాత్రం ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే.

Smell In Sweating: మీ చెమట కంపు వాసన వస్తోందా? అయితే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. ఈ వ్యాధి లక్షణం కావొచ్చు..
Sweat Smell
Shiva Prajapati
|

Updated on: Nov 22, 2022 | 7:34 AM

Share

వేసవిలో గానీ, ఎండలో గానీ చెమటలు పట్టడం అందరికీ సహజమే. కానీ చెమట చాలా దుర్వాసనగా ఉంటే మాత్రం ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. దుర్వాసనతో కూడిన చెమట కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అసలు ఎందుకు చెమట పడుతుంది? చెమట దుర్వాసనకు గల కారణాలు ఏంటి? చెమట వాసన రాకుండా ఎలా నివారించాలి? వంటి సమస్త సమాచారం ఇందులో ఇవ్వడం జరిగింది.

ప్రయోజనాలు ఏమిటి?

శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సాధారణంగా చెమటలు పట్టడం జరుగుతుంది. నిజానికి, శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చెమట గ్రంథులు చురుకుగా మారతాయి. చెమటతో, శరీర ఉష్ణోగ్రత సాధారణమవుతుంది. చెమట శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఉప్పు, చక్కెర కాకుండా.. చెమటలో కొలెస్ట్రాల్, ఆల్కహాల్ వంటి పదార్థాలు ఉంటాయి. చెమట శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి.

చెమట వాసన రావడానికి కారణం ఏమిటి?

మధుమేహం: ప్రతి ఒక్కరికి చెమట పడుతుంది. ప్రతి ఒక్కరి చెమట వాసనలు వేరుగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారి చెమటకు విచిత్రమైన వాసన ఉంటుంది. నిజానికి, మధుమేహం కారణంగా శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. దానిని సమర్థవంతంగా ఉపయోగించదు. ఇది అధిక రక్తంలో అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితిలో.. శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ కారణంగా చెమట చాలా దుర్వాసనగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం: మనం ఏది తిన్నా అది నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మనం జంక్ ఫుడ్‌ని ఎక్కువగా ఇష్టపడతాం. కొన్నిసార్లు చాలా కారంగా ఉండే ఆహారాన్ని తింటారు. ఈ సందర్భంలో చెమట వాసను విభిన్నంగా వస్తుంది. అటువంటి పరిస్థితిలో డైటీషియన్‌ను సంప్రదించి, తగిన సలహాలు తీసుకోవాలి.

థైరాయిడ్: మీ థైరాయిడ్ అతిగా చురుగ్గా ఉన్నప్పుడు చెమట నుండి విచిత్రమైన వాసన వస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పని చేస్తే, అది ఎక్కువ చెమటను కలిగిస్తుంది. అంతేకాకుండా.. చెమట దుర్వాసనను కలిగిస్తుంది. థైరాయిడ్ గ్రంధిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.

ఎక్కువగా మందులు తీసుకోవడం: సాధారణంగా ప్రజలు BP లేదా మరేదైనా ఇతర వ్యాధులకు మందులు తీసుకుంటారు. ఇది కూడా చెమట దుర్వాసనకు కారణం అవుతుంది. ఔషధంలోని రసాయనాలు వ్యాధి నుండి ఉపశమనం కలిగిస్తాయి. కానీ, చెమట దుర్వాసనకు కారణం అవుతుంది.

ఒత్తిడి కారణంగా దుర్వాసన: ఒక వ్యక్తి ఒత్తిడికి లోనైనప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా చెమట పడుతుంది. అంతే కాదు, చెమటకు వింత వాసన కూడా ఉంటుంది.

లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..