AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Care: పేరెంట్స్ బీ కేర్‌ఫుల్.. ఈ విషయాలు పిల్లల్లో మానసిక ఒత్తిడిని పెంచుతాయి..

పిల్లల మనసు చాలా ఫ్లెక్సిబుల్/సెన్సిటీవ్‌గా ఉంటుంది. చిన్న విషయాలే మనసును గాయపరుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల మనసును..

Children Care: పేరెంట్స్ బీ కేర్‌ఫుల్.. ఈ విషయాలు పిల్లల్లో మానసిక ఒత్తిడిని పెంచుతాయి..
Child Care
Shiva Prajapati
|

Updated on: Nov 22, 2022 | 8:00 AM

Share

పిల్లల మనసు చాలా ఫ్లెక్సిబుల్/సెన్సిటీవ్‌గా ఉంటుంది. చిన్న విషయాలే మనసును గాయపరుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల మనసును అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ బిజీ లైఫ్ వల్ల పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో తల్లిదండ్రులకు, పిల్లలను పట్టించుకునే సమయం దొరకడం లేదు.

పిల్లలు తమ సమస్యను ఎవరికీ చెప్పుకోలేక క్రమంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అంతే కాదు చాలా సార్లు వివిధ కారణాల వల్ల మానసికంగా కుంగిపోతుంటారు. అందుకే, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఒత్తిడిని గుర్తించాలి. ఒత్తిడికి కారణాన్ని గుర్తించాలి. మీ పిల్లలు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో తెలుసుకోవాలి. కారణాన్ని తెలుసుకున్న తరువాత, వారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు సహాయపడాలి.

తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లలతో స్నేహం చేయాలి. పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు వారు ఏడవడం, నేలపై పడుకోవడం, బిగ్గరగా అరవడం చేస్తుంటారు. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వారు తమను తాము బాధించుకోవడానికి కూడా భయపడరు. పిల్లల సమస్యలను తెలుసుకునే ముందు వారితో స్నేహం చేయాలి. అలా అయితే పిల్లలు భయపడరు. మీతో ఫ్రీగా ఉంటారు. పిల్లలు ఓపెన్ మైండ్‌తో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.

ఇవి కూడా చదవండి

సరైన డైట్ లేనప్పుడు పిల్లలు చాలా డిస్ట్రబ్ అవుతారు. తినే, తాగే, నిద్ర రొటీన్ చెదిరినప్పుడు శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. క్రమంగా పిల్లల్లో కోపం, చిరాకు పెరుగుతుంది. ఇక మొబైల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని విషయాలు మీ పిల్లల మనస్సును ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు పిల్లలు హింసాత్మకంగా మారవచ్చు. పిల్లలను మొబైల్, టీవీలకు అలవాటు పడనివ్వొద్దు. పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. మీ సమయాన్ని, ప్రేమను పిల్లలకు పంచాలి. మీ ప్రవర్తన, ఆలోచనలు, భావాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి.

లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..