AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICMR on Milk Tea: మీరు తేనీరు ప్రియులా.. పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక

కొంతమంది టీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. అయితే ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే ICMR టీకి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో పాలతో కూడిన టీ ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించింది. ICMR అధ్యయనం ప్రకారం పాలతో కూడిన టీ శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ఆహారం తిన్న తర్వాత లేదా ముందు టీ తాగితే అది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. అయితే ICMR అధ్యయనం తర్వాత.. కొందరు నిపుణులు టీ ఆరోగ్యానికి ఎలా హాని చేస్తుందో చెప్పారు.

ICMR on Milk Tea: మీరు తేనీరు ప్రియులా.. పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
Tea
Surya Kala
|

Updated on: May 18, 2024 | 6:04 PM

Share

దేశంలో టీ ప్రియులకు కొరత లేదు. అందుకే గ్రీన్ టీ, బ్లాక్ టీ, మిల్క్ టీ, చమేలీ టీ వంటి రకరకాల టీలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఎవరినైనా కలిసినా లేదా ఏదైనా చర్చించాలనుకున్నా టీ తాగుతూ మాట్లాడుకుందాం అని అంటారు. కొంతమంది టీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. అయితే ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే ICMR టీకి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో పాలతో కూడిన టీ ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించింది. ICMR అధ్యయనం ప్రకారం పాలతో కూడిన టీ శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ఆహారం తిన్న తర్వాత లేదా ముందు టీ తాగితే అది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించింది. అయితే ICMR అధ్యయనం తర్వాత.. కొందరు నిపుణులు టీ ఆరోగ్యానికి ఎలా హాని చేస్తుందో చెప్పారు.

టీలో రసాయనాలు

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో హెచ్‌ఓడి ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ మిల్క్ టీ గురించి అనేక విషయాలు చెప్పారు. డాక్టర్ కిషోర్ ప్రకారం బ్లాక్ టీ తాగితే శరీరానికి ప్రమాదం తగ్గుతుంది. అదే సమయంలో పాలతో చేసిన టీ అనేక సమస్యలను కలిగిస్తుంది. టీలో కూడా చాలా రకాల రసాయనాలు ఉంటాయని డాక్టర్ కిషోర్ చెబుతున్నారు. ఈ రసాయనాలు పాలలో కలిసినప్పుడు అవి రియాక్టివ్‌గా మారి శరీరానికి హాని కలిగిస్తాయి. టీలో టానిన్ ఉంటుందని డాక్టర్ కిషోర్ చెప్పారు. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఐరన్ లోపం ఉంటే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

వేడి సమస్య

గర్భధారణ సమయంలో టీ వంటి పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫీన్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మహిళలు అజీర్ణం, అధిక గ్యాస్ ఏర్పడటం, కడుపు మంట వంటి సమస్యలను ఎదుర్కొంటారు. టీలో ఉండే కెఫిన్ గుండెల్లో మంటను కలిగిస్తుందని లేదా ఇప్పటికే ఉన్న యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను పెంచుతుందని డాక్టర్ కిషోర్ చెప్పారు. పాలతో కూడిన టీ కడుపులో అధిక యాసిడ్ ఏర్పడటానికి కారణమవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

ఖాళీ కడుపుతో

టీలో ఉండే రసాయనాలు వికారం కలిగిస్తాయని డాక్టర్ కిషోర్ వివరిస్తున్నారు, ప్రత్యేకించి ఎక్కువ పరిమాణంలో లేదా ఖాళీ కడుపుతో త్రాగినప్పుడు. టీ ఆకులలో ఉండే టానిన్లు టీలో చేదు, పొడి రుచికి కారణమవుతాయి. టీలో ఉండే రసాయనాలు పాలలో కలిస్తే వివిధ రకాలుగా ఆరోగ్యానికి హానిని చేస్తాయి.

నిద్ర లేమికి కారణం

టీలో ఉండే కెఫిన్ మెలటోనిన్ హార్మోన్ పనితీరును పాడు చేస్తుందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. దీని వల్ల నిద్ర పట్టదు, నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల మానసిక సమస్యలు వస్తాయి. ఇది అలసట, జ్ఞాపకశక్తి బలహీనపడడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం కూడా వస్తుంది.

కెఫిన్ వ్యసనం

టీలో కెఫిన్ ఉంటుంది. నిత్యం టీ తాగితే కెఫిన్‌కు బానిసలవుతున్నారు. అందుకనే చాలా మంది కోరుకున్నప్పటికీ టీ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నారు. శరీరంలో కెఫిన్ పరిమాణం పెరిగితే, తలనొప్పి, చిరాకు, హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలను కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..