Pregnancy Diet: గర్భధారణ సమయంలో మహిళల డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? ICMR ఏమి సూచించిందంటే..
ఇటీవల ICMR గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహార విషయంలో మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన సరైన ఆహారం గురించి తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని చాలా వ్యాధులకు మూల కారణం సరైన ఆహారం తీసుకోక పోవడం వల్లే అని వెల్లడించింది. గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం ఎలా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గర్భధారణ సమయంలో స్త్రీలు తినే ఆహారం నుంచి తీసుకునే విశ్రాంతి వరకూ అన్నీ పుట్టబోయే బిడ్డను ప్రభావితం చేస్తాయి. నవజాత శిశువు పుట్టిన తర్వాత.. శిశివు అభివృద్ధి, ఆరోగ్యం కూడా పోషకాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో మహిళలు తమ పిల్లలతో పాటు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఇటీవల ICMR గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహార విషయంలో మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన సరైన ఆహారం గురించి తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని చాలా వ్యాధులకు మూల కారణం సరైన ఆహారం తీసుకోక పోవడం వల్లే అని వెల్లడించింది. గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం ఎలా ఉండాలో ఈ రోజు తెలుసుకుందాం.
అల్పాహారం ఎలా తీసుకోవాలంటే
ICMR డైటరీ మార్గదర్శకాల ప్రకారం మహిళలు ఉదయం 6 గంటలకు ఒక గ్లాసు (150 ml) పాలు తాగాలి. దీని తర్వాత ఉదయం 8 గంటలకు ఆహారంలో 60 గ్రాముల తృణధాన్యాలు, 75 గ్రాముల ఆకుకూరలు, 20 గ్రాముల పప్పులు, 20 గ్రాముల మొలకెత్తే విత్తనాలు, 5 గ్రాముల నెయ్యి తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనంలో వేటిని తీసుకోవాలంటే
గర్భిణులు మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల అన్నం లేదా రోటీ, 30 గ్రాముల పప్పులు లేదా మాంసం, కూరగాయల కూర, 75 గ్రాముల పచ్చి కూరగాయలు, 200 గ్రాముల పండ్లు, 100 గ్రాముల తాజా పండ్లు తినాలి. అదే సమయంలో సాయంత్రం 4 గంటలకు చిరుతిండిగా పాలతో పాటు 20 గ్రాముల చిరు ధాన్యాలను చేర్చుకోండి.
రాత్రి భోజనం కోసం వీటిని తినండి
రాత్రి సమయంలో మహిళలు 60 గ్రాముల అన్నం లేదా రోటీ, 25 గ్రాముల పప్పు, 75 గ్రాముల పచ్చి కూరగాయలు, 50 గ్రాముల తాజా పండ్లు తినాలి.
ఏమి చేయాలి, ఏమి చేయకూడదంటే..
గర్భధారణ సమయంలో మహిళలు తినే ఆహారంలో ఉసిరి, జామ, ఆరెంజ్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను చేర్చుకోవాలి. వికారం లేదా వాంతులతో ఇబ్బంది పడుతుంటే.. రోజులో తినే ఆహారం కొంచెం కొంచెం తీసుకోండి. విటమిన్ డి లోపం లేకుండా ఉండడం కోసం ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం కోసం ఆకుపచ్చ కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోవాలి.
ఏమి చేయకూడదంటే గర్భధారణ సమయంలో ధూమపానం, మద్యపానం, పొగాకుకు దూరంగా ఉండండి. కార్బోనేటేడ్ నీటికి దూరంగా ఉండండి. తిన్న వెంటనే నిద్రపోకండి, కూర్చోకండి. కొంత సేపు నడవండి. అంతే కాకుండా ఆహారం తిన్న తర్వాత కాఫీ, టీలు తాగకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..