Narasimha Jayanti 2024: నరసింహ జయంతి మే 20 లేదా 21 ఎప్పుడు? పూజ శుభ సమయం ఎప్పుడంటే
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి తిథి మంగళవారం మే 21 సాయంత్రం 5:39 నుంచి ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే మే 22 సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం నరసింహ జయంతిని 21 మే 2024 మంగళవారం జరుపుకుంటారు. మే 21వ తేదీ మంగళవారం కావడం వల్ల ఈ సంవత్సరం నరసింహ జయంతి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.
హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహా విష్ణువు పది అవతారాలను ధరించాడు. అందులో శ్రీ మహా విష్ణువు నాల్గవ అవతారం నరసింహ అవతారం. శ్రీ మహా విష్ణువు నరసింహావతారంలో సగం మానవ శరీరం, మిగిలిన సగం సింహం శరీరం కలిగి ఉంటుంది. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుడనే రాక్షసుడిని చంపడానికి విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు. మహావిష్ణువు నరసింహావతారంలో అవతరించిన రోజుని నరసింహ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున నరసింహ స్వామిని పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. నరసింహ జయంతి ఎప్పుడు, పూజ, శుభ సమయం, ఉపవాసం విరమించే సమయం గురించి తెలుసుకుందాం.
నరసింహ జయంతి ఎప్పుడంటే
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి తిథి మంగళవారం మే 21 సాయంత్రం 5:39 నుంచి ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే మే 22 సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం నరసింహ జయంతిని 21 మే 2024 మంగళవారం జరుపుకుంటారు. మే 21వ తేదీ మంగళవారం కావడం వల్ల ఈ సంవత్సరం నరసింహ జయంతి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే నరసింహ స్వామి జయంతి ధైర్యం, ఆత్మవిశ్వాసం, వినయ, విధేయతను పెంచుతుందని చెబుతారు.
పూజకు అనుకూలమైన సమయం
పంచాంగం ప్రకారం నరసింహ జయంతి రోజున మే 21 సాయంత్రం 4:24 నుంచి 7:09 వరకు నరసింహ స్వామిని ఆరాధించడానికి అనుకూలమైన సమయం. అందువల్ల ఈ సంవత్సరం నరసింహ స్వామి భక్తులు అతని పూజల కోసం 02 గం. 44 ని. వ్యవధి ఉంది.
రవియోగం, స్వాతి నక్షత్రం, చిత్రా నక్షత్ర యోగం ఏర్పడుతున్నాయి.
ఈ ఏడాది నరసింహ జయంతి రోజున రవియోగం, స్వాతి నక్షత్ర యోగం కూడా ఏర్పడుతోంది. ఈ రోజున నరసింహ జయంతి రోజున రవియోగం మే 22వ తేదీ ఉదయం 5.46 నుంచి మరుసటి రోజు ఉదయం 5.27 వరకు, చిత్రా నక్షత్రం ఉదయం 5.46 వరకు.. దీని తరువాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇది మే 22 ఉదయం 7.47 వరకు ఉంటుంది.
ఉపవాస సమయం
నరసింహ జయంతి రోజున శ్రీ మహా విష్ణువు నరసింహావతారాన్ని పూజించి వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. ఈసారి నరసింహ జయంతి రోజున ఉపవాసం విరమించే సమయం మే 22వ తేదీ బుధవారం ఉదయం సూర్యోదయం తర్వాత.. మధ్యాహ్నం 12:18 లోపు ఉపవాసాన్ని విరమించుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు