సైన్స్‌కు అందని మిస్టరీ.. 3 కాలాల్లోనూ రూపం మార్చుకునే పీతాంబర అమ్మవారు.. పసుపు సమర్పిస్తే కరుణించే దైవం..

పీతాంబర అమ్మవారు ప్రసిద్ధ సిద్ధపీఠం మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఉంది. ఈ పీఠాన్ని సిద్ధ సంత్ స్వామి 1935లో స్థాపించారు. ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం ఎటువంటి తలుపులు ఉండవు. అందుకు బదులుగా ఒక చిన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీ ద్వారా బగళాముఖీ దేవిని దర్శనం చేసుకోవచ్చు. ఈ సిద్ధపీఠంలోని అమ్మవారికి పసుపు వస్త్రాలు ధరించి పసుపు హారతిని సమర్పించడం ద్వారా భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం.

సైన్స్‌కు అందని మిస్టరీ.. 3 కాలాల్లోనూ రూపం మార్చుకునే పీతాంబర అమ్మవారు.. పసుపు సమర్పిస్తే కరుణించే దైవం..
Pitambara Peeth
Follow us
Surya Kala

|

Updated on: May 18, 2024 | 4:46 PM

దేశంలో అనేక దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో శాస్త్రవేత్తలు కూడా పరిష్కరించలేకపోయిన కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి. అలాంటి ఒక అద్భుత ఆలయం.. మధ్యప్రదేశ్‌లోని దతియాలోఉంది. దీనిని రాజసత్తా దేవత అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు బగళాముఖీ దేవి శత్రువులను నాశనం చేసిన దేవత అని భక్తుల నమ్మకం. ఎవరైనా అధికారాన్ని ని ఆకాంక్షించే భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి రహస్యంగా పూజలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఎన్నికలకు ముందు భారీ సంఖ్యలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు క్యూ లో నిల్చుని మరీ పూజలు చేస్తారు. ఈ అద్భుతమైన అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం…

పీతాంబర అమ్మవారు పీతాంబర అమ్మవారు ప్రసిద్ధ సిద్ధపీఠం మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఉంది. ఈ పీఠాన్ని సిద్ధ సంత్ స్వామి 1935లో స్థాపించారు. ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం ఎటువంటి తలుపులు ఉండవు. అందుకు బదులుగా ఒక చిన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీ ద్వారా బగళాముఖీ దేవిని దర్శనం చేసుకోవచ్చు. ఈ సిద్ధపీఠంలోని అమ్మవారికి పసుపు వస్త్రాలు ధరించి పసుపు హారతిని సమర్పించడం ద్వారా భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం.

మూడు కాలాల్లోనూ తల్లి రూపం మారుతుంది ఈ ఆలయంలో పీతాంబర దేవి మూడు కాలాల్లో వివిధ రూపాలను తీసుకుంటుంది. భక్తులు ఉదయాన్నే అమ్మవారి రూపాన్ని దర్శిస్తే.. మరుసటి గంటలో మరొక రూపాన్ని చూసే భాగ్యం కలుగుతుంది. బగళాముఖీ దేవి రూపం ఎలా మారుతుందనే రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ఇది ఒక అద్భుతంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే రాజ్యాధికారం పొందడంలో అమ్మవారి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో స్థానిక ప్రజల ప్రకారం, తల్లి పీతాంబరాన్ని ఆరాధించడం వ్యాజ్యాలు మొదలైన కేసులలో కూడా విజయం సాధిస్తుందని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆరతి సమయంలో మాత్రమే దర్శనం ఈ ఆలయంలో ఖండేశ్వర్ మహాదేవుడు, ధూమావతితో పాటు పీతాంబర అమ్మవారి దర్శనం పొందవచ్చు. తాంత్రిక రూపంలో పూజించబడే ఈ ఆలయానికి కుడివైపున ఖండేశ్వర్ మహాదేవ్ కొలువుదీరి ఉన్నాడు. పది మహావిద్యలలో ఒకరైన ధూమావతి తల్లి మహాదేవుని ఆస్థానం వెలుపల కనిపిస్తుంది. అత్యంత విశిష్టత ఏమిటంటే భక్తులకు ఆరతి సమయంలో మాత్రమే ధూమావతి దర్శన భాగ్యం లభిస్తుంది. ఎందుకంటే మిగిలిన సమయాల్లో ఆలయ తలుపులు మూసివేయబడతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు