గుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్ కావాలా..? అయితే ఈ పప్పులను తినండి.. ఇక నో టెన్షన్..
శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి విటమిన్లు, మినరల్స్‌తో పాటు ప్రొటీన్లు కూడా చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. అయితే, శరీర అభివృద్ధి నుంచి రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రోటీన్ తోపాటు విటమిన్లు చాలా సహాయపడతాయి. ప్రోటీన్ మూలాలలో ఒకటి గుడ్లు..

శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి విటమిన్లు, మినరల్స్‌తో పాటు ప్రొటీన్లు కూడా చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. అయితే, శరీర అభివృద్ధి నుంచి రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రోటీన్ తోపాటు విటమిన్లు చాలా సహాయపడతాయి. ప్రోటీన్ మూలాలలో ఒకటి గుడ్లు.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ రోజుకు కనీసం 1 గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, తృణధాన్యాల్లో (పప్పులు) గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.
అయితే, చాలామంది గుడ్లు తినరు లేదా మాంసాహారం తీసుకోరు.. అలాంటి వారికి ప్రొటిన్ లోపం ఉంటుంది.. అలాంటి వారు శరీరంలో ప్రోటీన్ స్థాయిలను నిర్వహించడానికి వారు పప్పులను తినవచ్చు. కొన్ని పప్పుల్లో గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
పప్పులలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని అన్నం లేదా రొట్టెలతో తినవచ్చు. పప్పు చాలా మందికి సులభంగా జీర్ణం కాదు. అలాంటప్పుడు పప్పు చారు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.
పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. కందిపప్పు, మసూర్ పప్పు, పెసర పప్పులో గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి తల్లులు, అమ్మమ్మలు ఉపవాసం ఉన్నప్పుడు, శనగపప్పు ఉడకబెట్టి తింటారు. తద్వారా శరీరంలో ప్రోటీన్ లోపం ఉండదు.
ముఖ్యంగా పెసర పప్పు కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి డైట్‌లో ఉన్నవారు కూడా పెసరపప్పు తింటే ప్రొటీన్ లెవెల్స్ అదుపులో ఉంటాయి
జిమ్, యోగా లేదా ఇతర శారీరక శ్రమలలో పాల్గొనే వారికి పెసరపప్పు, కందిపప్పు, శనగల మొలకలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో అధిక ప్రొటీన్‌తో పాటు క్యాల్షియం, ఐరన్ తగినంత మొత్తంలో ఉంటాయి.
ఇంకా వీటిని కూరగా లేదా.. ఉడకబెట్టుకుని కూడా తినవచ్చు.. అందుకే డైలీ ఒక కప్పు పప్పును తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




