Carrot Milkshake: మండే ఎండల నుంచి రిలీఫ్ ఇచ్చే క్యారెట్ మిల్క్ షేక్..
మిల్క్ షేక్స్‌లో ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్దీ. అంతే కాకుండా రుచిగా కూడా ఉంటాయి. ఈ మిల్క్ షేక్స్ వేటితో అయినా తయారు చేసుకోవచ్చు. వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. క్యారెట్‌తో సాధారణంగా జ్యూసులు తయారు చేస్తారు. కానీ దీంతో మిల్క్ షేక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల మండే ఎండల నుంచి ఎంతో ఉపశమనం..

మిల్క్ షేక్స్‌లో ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్దీ. అంతే కాకుండా రుచిగా కూడా ఉంటాయి. ఈ మిల్క్ షేక్స్ వేటితో అయినా తయారు చేసుకోవచ్చు. వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. క్యారెట్‌తో సాధారణంగా జ్యూసులు తయారు చేస్తారు. కానీ దీంతో మిల్క్ షేక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల మండే ఎండల నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది. అయితే పంచదార కాస్త తక్కువగా ఉపయోగిచండం లేదంటే షుగర్ ఫ్రీ యూజ్ చేసినా మంచిదే. మరి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్యారెట్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
క్యారెట్, మిల్క్, బాదం, జీడిపప్పు, షుగర్, యాలకుల పొడి, కోవా, హార్లిక్స్
క్యారెట్ మిల్క్ షేక్ తయారీ విధానం:
ముందుగా బాదం, జీడిపప్పును వేడి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పాలను బాగా మరిగించి.. చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌ని శుభ్రంగా కడిగి.. పైపైన తొక్క తీయాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో క్యారెట్ ముక్కలు, నానబెట్టిన బాదం, జీడిపప్పు, చల్లగా ఉండే పాలు, కోవా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన దాన్ని సర్వింగ్ గ్లాసుల్లో వేయాలి. ఆ పైన హార్లిక్స్ పౌడర్ చల్లి తాగితే.. చాలా రుచిగా ఉంటుంది.
మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఇందులో కోవా వేశారు కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల ఎండ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులోనూ ఇంట్లో చేసిందే కాబట్టి.. చాలా శుభ్రంగా ఉంటుంది.








