AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acid Reflux: యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..

ప్రస్తుత కాలంలో చాలామంది అసిడిటీ సమస్యతో సతమతం అవుతున్నారు. అది యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది. సాధారణంగా కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది.

Acid Reflux: యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలు అస్సలు తినకండి..
Acid Reflux
Shiva Prajapati
|

Updated on: Mar 22, 2023 | 9:34 PM

Share

ప్రస్తుత కాలంలో చాలామంది అసిడిటీ సమస్యతో సతమతం అవుతున్నారు. అది యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది. సాధారణంగా కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. ఇది వికారం, గుండెల్లో మంట, నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా భోజనం తరువాత ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఏం తినకూడదు? అనేది కీలకంగా మారింది. మంచి ఆహారం, జీవనశైలితో ఈ యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ఎదుర్కోవడానికి మంచి డైటింగ్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి బయటపడేందుకు ఏం తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు చెక్ పెట్టే ఆహారాలు..

1. మజ్జిగ:

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌ సమస్యను తగ్గిస్తుంది. 2 టేబుల్‌స్పూన్ల పెరుగు తీసుకుని, కొద్దిగా నీళ్లు కలిపి ఉప్పు, వేయించిన జీలకర్ర, ఎండుమిర్చి వేసి కలపాలి. ఆ తరువాత ఆ మజ్జిగను తాగాలి. తద్వారా క్రమంగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

2. మంచినీరు:

మంచినీటిలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. శరీరంలో pH బ్యాలెన్స్‌ను నిర్వహిస్తుంది. ఎసిడిటీకి అద్భుతమైన ఔషధం నీరు.

3. జింజర్, లెమన్ వాటర్:

అల్లం జీర్ణశయ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. నిమ్మకాయలోని ఆల్కలీన్ లక్షణాలు యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గిస్తుంది. కొన్ని నీటిలో చిన్న అల్లం ముక్క వేసి ఉడకబెట్టాలి. ఆ తరువాత ఆ నీటిని వడకట్టాలి. ఆ తరువాత నిమ్మకాయ రసం పిండాలి. కొంచెం తేనె కూడా కలిపి, తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను పెంచే ఆహారాలు..

1. టీ/కాఫీ:

టీ, కాఫీలలో అధిక కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది ఆమ్లత్వాన్ని మరింత పెంచుతుంది. టీ, కాఫీ తో రోజును ప్రారంభించడం మంచిది కాదు. దీనికి బదులుగా వేడి నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

2. చాక్లెట్లు:

చాక్లెట్లలోనూ కెఫిన్ ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్య పెరుగుతుంది. కావున, చాక్లెట్లు తక్కువగా తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

3. కార్బోనేటేడ్ డ్రింక్స్:

కూల్ డ్రింక్స్, సోడా వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్ అన్నవాహిక pHని తాత్కాలికంగా అసమతుల్యం చేస్తాయి. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు ఈ డ్రింక్స్‌కి దూరంగా ఉండటం మంచింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..