Health: డయాబెటిక్ బాధితులకు జామ ఆకులు అద్భుత వరం.. ఎన్నో అద్భుత ప్రయోజనాలు.. అంతే కాకుండా
జామ కాయ (Guava).. ఈ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఈ పండ్లల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. జామ ఆకులు కూడా చాలా ఆరోగ్యకరమైవే. జామ ఆకులతో టీ చేసుకుని తాగితే చాలా...
జామ కాయ (Guava).. ఈ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఈ పండ్లల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే.. జామ ఆకులు కూడా చాలా ఆరోగ్యకరమైవే. జామ ఆకులతో టీ చేసుకుని తాగితే చాలా ఉపయోగాలున్నాయి. జామాకుల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. శరీరంలోని పలురకాల ఇన్‌ఫెక్షన్లను పోగొట్టే లక్షణం వీటికి ఉంది. బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులను తగ్గిస్తాయి. దగ్గు, జలుబు పోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. చర్మానికి (Health) ఉపయోగపడే కాంపౌండ్స్ వీటిలో ఉండటం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. జామ ఆకులతో చేసిన టీ తాగటం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ. బీపీని అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెరశాతాన్ని నియంత్రిస్తుంది. ఈ ఆకుల్లో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. నొప్పుల నివారణకు జామాకులను ఉపయోగిస్తారు. మెదడు ఆరోగ్యానికి మంచిది. పంటినొప్పిని తగ్గించడమే కాకుండా జుట్టు రాలిపోవటాన్ని అరికడుతుంది. జామ ఆకుల్లో క్యాన్సర్ వ్యతిరేక గుణాలు ఉంటాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. జామ ఆకుల వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో జామ ఆకులు మంచి ఫలితాలను ఇస్తాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి జామ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
జామ ఆకులను రోజూ తినలేం. కానీ ఒకటి రెండు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఆకులు తీసేసి నీటిని వడకట్టాలి. అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ చేసుకుని తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులు సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం