AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Style: బెడ్ రూమ్ లో అద్దాలు పెట్టుకుంటున్నారా.. మీకు ఈ సమస్యలు రావచ్చు.. వాస్తు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..

లేటెస్ట్ ట్రెండ్‌లు, డిజైన్‌లతో తమ ప్రాధాన్యతలు, అభిరుచులకు అనుగుణంగా ఇళ్లను అలంకరించుకుంటున్నారు. పనిలో బిజీగా గడిపిన తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి, హాయిగా నిద్రపోవడానికి, ఏకాంతంగా...

Life Style: బెడ్ రూమ్ లో అద్దాలు పెట్టుకుంటున్నారా.. మీకు ఈ సమస్యలు రావచ్చు.. వాస్తు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..
Bed Room
Ganesh Mudavath
|

Updated on: Aug 23, 2022 | 7:01 AM

Share

లేటెస్ట్ ట్రెండ్‌లు, డిజైన్‌లతో తమ ప్రాధాన్యతలు, అభిరుచులకు అనుగుణంగా ఇళ్లను అలంకరించుకుంటున్నారు. పనిలో బిజీగా గడిపిన తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి, హాయిగా నిద్రపోవడానికి, ఏకాంతంగా గడపడానికి మనం ఎక్కువగా బెడ్‌రూమ్ ను ఉపయోగిస్తుంటాం. వాస్తు శాస్త్ర (Vastu Shastras) సూత్రాల ప్రకారం పడక గది వల్ల ఆరోగ్యం, ఆనందం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. వాస్తు ప్రకారం పడకగది ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో ఉండాలి. పడక గది ప్రవేశ ద్వారం గోడకు ఉత్తరం, పడమర లేదా తూర్పు వైపున ఉండాలి. సింగిల్ డోర్‌లతో కూడిన బెడ్‌రూమ్ ఉత్తమం. ప్రవేశ ద్వారం ఎదురుగా ఎప్పుడూ మంచం వేయకూడదు. దక్షిణం లేదా తూర్పు దిశలో తల పెట్టి నిద్రించాలి. ఈ వాస్తు స్లీపింగ్ దిశ రాత్రి నిద్రను ఆస్వాదించడానికి, సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. మంచం ఉత్తరం వైపుకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.వాస్తు ప్రకారం పడకగదిలో (Bed Room) అద్దాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఎందుకంటే అవి చెడు వైబ్‌లను ఆకర్షిస్తాయి. ఉత్తరం, తూర్పు, పడమర దిశల్లో మాత్రమే అద్దాలు ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్ రూమ్ లో ఉన్న పెయింటింగ్స్, శిల్పాలు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. హింస లేదా సంఘర్షణను వర్ణించే పెయింటింగ్‌లు లేదా విగ్రహాలు గదిలో లేకుండా చూసుకోవాలి. పడకగదిలో రంగులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. లేత గులాబీ, బూడిద, నీలం, గోధుమ, ఆకుపచ్చ రంగులు పడక గదిలో ఉండాలి. పిల్లల బెడ్‌రూమ్‌లకు పశ్చిమ దిశ అనువైనదిగా వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే అవి ఒత్తిడికి దారి తీస్తాయి. ఫలితంగా మంచి నిద్ర కరవవుతుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి