Jaggery Benefits : బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు..!

ఇది రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో మద్దతు ఇస్తుంది. బెల్లం వివిధ ఖనిజాలు, విటమిన్ల మూలం, ఇది మొత్తం రోగనిరోధక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వాటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం రక్షణ విధానాలను బలోపేతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Jaggery Benefits : బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు..!
Jaggery And Turmeric
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 27, 2024 | 8:23 PM

శీతాకాలం అప్పుడే వణికిస్తోంది. ఉదయం ఎనిమిది దాటినా చలి తీవ్రత తగ్గటం లేదు. నవంబర్‌ నెలలోనే చలి తీవ్రత ఇలా ఉంటే.. జనవరి, ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే, చలిని తట్టుకోవడానికి తగిన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం, చలికాలంలో పసుపు, చిన్న బెల్ల ముక్కతో రోజును ప్రారంభించడం ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శీతాకాలపు అల్పాహారంలో పచ్చి పసుపు, చిన్న బెల్లం ముక్కను తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పసుపులో కర్కుమిన్, ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మిమ్మల్ని చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, ఈ రెండు పసుపు, బెల్లం కలిపి తినడం వల్ల మీ బలహీనమైన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కూడా పసుపు, బెల్లం కలిపి తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుంది. ఇది మీలో జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు కాలేయ పనితీరుకు తోడ్పడే నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. బెల్లం శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపడం ద్వారా శరీరాన్ని శుభ్రపరుస్తుంది. పసుపు ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో మద్దతు ఇస్తుంది. బెల్లం వివిధ ఖనిజాలు, విటమిన్ల మూలం, ఇది మొత్తం రోగనిరోధక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వాటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం రక్షణ విధానాలను బలోపేతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..