తేనె, మిరియాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? శరీరంలో జరిగేది ఇదే..!

తేనె, నల్లమిరియాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే సాధనం. ఈ సీజన్ లో ఒకటి లేదా రెండు నల్ల మిరియాలు కలిపి 1 టీస్పూన్ తేనె తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తేనె, మిరియాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..? శరీరంలో జరిగేది ఇదే..!
మీరు ఉదయాన్నే నిద్రలేవగానే అలసటగా, నీరసంగా అనిపిస్తే, తేనె, నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల సహజమైన గ్లూకోజ్, పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే ఇవి శారీరక బలాన్ని పెంచడంలో సహాయపడతాయి.
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 27, 2024 | 8:04 PM

చలికాలంలో.. ప్రతి వంటింట్లోనూ మసాలాల వాడకం పెరుగుతుంది. లవంగాలు, యాలకులు, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు ఇలా అనేక మసాలాలు గృహ నివారణ చిట్కాలలో ఉపయోగిస్తారు. అయితే, నల్ల మిరియాలను తేనెతో కలిపి తీసుకుంటే శీతాకాలంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో తేనె, నల్ల మిరియాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తేనెలో కలిపి నమలడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. ఈ రెండింటీ కలయికతో కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

తేనె, నల్లమిరియాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే సాధనం. ఈ సీజన్ లో ఒకటి లేదా రెండు నల్ల మిరియాలు కలిపి 1 టీస్పూన్ తేనె తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ కె, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు తేనెలో ఉంటాయి. నల్ల, తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

శీతాకాలంలో ఎక్కువగా వచ్చే కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలకు తేనె, మిరియాల రెమిడీ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం చిటికెడు నల్లమిరియాలు, తేనెతో కలిపి తిన్న తర్వాత అరగంటపాటు నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల గొంతులో కఫం, నోటి దుర్వాసన, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు నయమవుతాయి.

ఇవి కూడా చదవండి

తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శ్వాసనాళంలో వాపును తగ్గిస్తుంది. ఇది శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. బరువు పెరగడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి తేనె మిరియాల పొడి మిశ్రమం మేలు చేస్తుంది. ఈ మిశ్రమాన్ని వేడి నీటిలో కలిపి తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..