ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు మృతి.. అతని వయసు ఎంతో తెలుసా..? తన దీర్ఘాయువుకు కారణం ఇదేనట..

ఆయన తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఇదేనంటూ వివరించారు..

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు మృతి.. అతని వయసు ఎంతో తెలుసా..? తన దీర్ఘాయువుకు కారణం ఇదేనట..
The Worlds Oldest Person
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 27, 2024 | 7:16 PM

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్‌ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ 112 ఏళ్ల వయసులో మరణించాడు. అతను దాదాపు తొమ్మిది నెలల పాటు అత్యంత వయోవృద్ధుడు అనే హోదాను కలిగి ఉన్నాడు. వాయువ్య ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ సమీపంలోని కేర్ హోమ్‌లో టిన్నిస్‌వుడ్ సోమవారం మరణించినట్లు అతని కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన 1912 ఆగస్టు 26న జన్మించారు. ఆయనకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బృందం ఈ ఏడాది ఏప్రిల్​లో సర్టిఫికెట్‌ అందజేసింది.

టిన్నిస్‌వుడ్ తన దీర్ఘాయువుకు తన అదృష్టమే కారణమని చెప్పాడు. టైటానిక్‌ నౌక మునిగిన కొన్ని రోజులకే పుట్టారు జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌. ఆయన తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని చెప్పేవారు. ఆరోగ్యకరమైన జీవితానికి మితంగా ఉండటమే కీలకం. అతను ఎప్పుడూ ధూమపానం చేయలేదు. చాలా అరుదుగా మద్యం తాగాడు. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్ తినడం తప్ప ప్రత్యేకమైన ఆహారం లేదు.

సమాచారం ప్రకారం.. జాన్ చాలా తెలివైనవాడు. నిర్ణయాత్మకుడు, ధైర్యవంతుడు, ఏ సంక్షోభంలోనైనా ప్రశాంతంగా ఉండేవాడు. అతను గణితశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నవాడు. మాట్లాడటంలో నిపుణుడు. ఆయనకు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. భార్య బ్లాడ్వెన్ 1986లోనే మరణించారు. మరో విశేషమేమిటంటే.. 100 ఏళ్ల నుంచి 110 ఏళ్ల వరకు క్వీన్ ఎలిజబెత్ ఆయనకు ప్రతి సంవత్సరం ఉత్తరాలు పంపేవారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..