- Telugu News Photo Gallery These foods must be given to children above five years of age, Check Here is Details
Foods for Kids: ఐదేళ్లు దాటిన పిల్లలకు ఈ ఫుడ్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే..
పిల్లలు చక్కగా కేరింతలు కొడుతూ ఆరోగ్యంగా ఆడుకోవాలంటే మంచి ఫుడ్స్ ఇవ్వాలి. అలాగే త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారాలు ఇవ్వాలి. అందులోనూ ఐదేళ్ల పిల్లలకు మరింత పోషకాహారాలు అందించాలి..
Updated on: Nov 27, 2024 | 7:58 PM

పిల్లలు పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలని, వాళ్లను ఆరోగ్యంగా ఉంచాలని ప్రతీ తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది. కానీ వారికి ఎలాంటి ఆహారం అందించాలో కూడా తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచే సరైన ఆహారం అందిస్తే.. వాళ్లు అన్నింటా ముందు ఉంటారు.

ఇంట్లో ఉండే ఐదేళ్లు దాటిన పిల్లలకు ఖచ్చితంగా కొన్ని రకాల ఆహారాలు అందించాలి. ప్రోటీన్, పాలు, కూరగాయాలు, పండ్లు, తృణ ధాన్యలు వంటి ఆహారాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

పిల్లలకు అసలు పంచదార తక్కువగా ఉండే ఆహారాలు ఇచ్చేలా చూసుకోండి. పండ్ల రసం, పండ్లు ముక్కలు వారు తినేలా చూసుకోండి. అలాగే బీన్స్, బఠానీలు ఉండే ఆహారాలు ఇస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. త్వరగా రోగాలు రాకుండా ఉంటాయి.

అదే విధంగా పాలు కూడా ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా గ్లాస్ పాలు తాగేలా చూసుకోండి. పాలు తాగడం వల్ల వారిలో శక్తి పెరుగుతుంది. ఎముకలు, కండరాలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ధాన్యం కూడా పిల్లలకు చాలా ముఖ్యం. రోజు వారి ఆహారంలో తృణ ధాన్యాలు వారికి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. గోధుమలు, మొక్కజొన్న, ఓట్స్, బియ్యం, రాజ్మాలు వంటివి చూసుకోండి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




