Belly Fat Control: బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా కరిగించే బెస్ట్ వ్యాయామాలు..
ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు, మగవాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి. బెల్లీ ఫ్యాట్ కారణంగా అనేక ఇతర వ్యాదులు కూడా వస్తున్నాయి. బెల్లీ ఫ్యాట్‌ని ఎలాగైనా కరిగించుకోవాలి..
Updated on: Nov 27, 2024 | 6:42 PM

ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఇబ్బంది పడే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి. బెల్లీ ఫ్యాట్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. శారీరక శ్రమ లేకుండా కూర్చొని పని చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది.

అలాగే ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో సీజనల్ ఫ్రూట్‌లను చేర్చుకోవాలి. దానితో పాటు మీకు నచ్చిన పండ్లను ఎంచుకోవచ్చు. అయితే ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లను ఎంచుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆపిల్, దానిమ్మ బెస్ట్ ఆప్షన్.

అయితే వ్యాయామాల ద్వారా చాలా సింపుల్‌గా తగ్గించవచ్చు. స్కిప్పింగ్ ఆడటం వల్ల త్వరగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. స్కిప్పింగ్ ఆడటం వల్ల శరీరం కూడా ఫిట్‌గా, బలంగా తయారవుతుంది. రోజుకు కనీసం ఐదు నిమిషాలు స్కిప్పింగ్ చేసినా మంచి రిజల్ట్స్ వస్తాయి.

అందుకే బెల్లీ ఫ్యాట్‌ని వెంటనే తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే, దానిని తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు నిపుణుల మాటల్లో మీ కోసం..

క్రంచెస్‌తో కూడా చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించవచ్చు. వీపుపై పడుకుని మోకాళ్లను మడవాలి. చేతుల్ని కూడా తల వెనక్కి పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజూ పది సార్లు అయినా చేయాలి. ఇలా ఈజీగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)



















