Lifestyle: రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీరు తాగడం ఇటీవల ఎక్కువుతోంది. చాలా మంది ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే శరీరంలో అద్బుతమైన మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. అంతకీ ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరిలో అవగాహన పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేద మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం ఇందులో ఒక రకమైన ప్రాక్టీస్. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఉదయం లేచిన వెంటనే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరు వెచ్చి నీరు తాగడం వల్ల శరీరంలో జరిగే మార్పులు మీ ఊహకు కూడా అందవని నిపుణులు అంటున్నారు. ఇంతకీ రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగి పడుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ బలాదూర్ అవుతాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై ఉదయం సుఖ విరేచనం అవుతుంది. రోజుల్లో ఎప్పుడైనా హెవీ ఆహారం తీసుకుంటే ఆహారం బాగా జీర్ణమవుతుంది. కడుపుబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. గోరువెచ్చని నీరు శరీరంలో నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది.
ఇది ఒత్తిడి, యాంక్సైటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో ఉదయం రకరకాల పనుల ద్వారా ఎదుర్కొన్న ఒత్తిడి తగ్గిపోయి రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగి పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పిని సైతం ఈ గోరువెచ్చని నీటితో చెక్ పెట్టొచ్చు. రాత్రి ఈ నీరు తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
జలుబు, దగ్గు సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునేంద ముందు హాట్ వాటర్ తాగితే ముక్కు దిబ్బడ వంటి సమస్యలను దూరం చేస్తుంది. గొంతి నొప్పి సమస్య ఉంటే తగ్గుతుంది. ఇక గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..