AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singapore Fried Rice: సింగపూర్ స్ట్రైల్‌లో ఫ్రైడ్ రైస్.. తిన్నవాల్లు ఆహా అంటారు..

ఫ్రైడ్ రైస్‌లు అంటే భారతీయులు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సులువుగా అయ్యే వాటిల్లో ఫ్రైడ్ రైస్‌ కూడా ఒకటి. ఇంట్లో చేసిన వాటి కంటే బయట తినేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ చైనీస్ స్టైల్‌లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్‌లో ఫేమస్‌ అయినా సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం...

Singapore Fried Rice: సింగపూర్ స్ట్రైల్‌లో ఫ్రైడ్ రైస్.. తిన్నవాల్లు ఆహా అంటారు..
Singapore Fried Rice
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 17, 2024 | 9:32 PM

Share

చైనీస్ ఫుడ్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. భారత దేశంలో కూడా చైనీస్ రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. ఫుడ్ ఎలా ఉంటుందోనని టేస్టే చేస్తూ ఉంటారు. మన దేశంలో కంటే ఇతర దేశాల్లో ఫ్రైడ్ రైస్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా సింగపూర్ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్. సింగపూర్‌లో ఫ్రైడ్ రైస్ అనేది ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. అందుకే చైనీస్ ఫుడ్ ఐటెమ్స్‌లో ఖచ్చితంగా సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఈ రెసిపీ రుచిగా కాస్త భిన్నంగా ఉంటుంది. మరి ఈ సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేస్తారు? తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సింగపూర్ ఫ్రైస్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

బాస్మతి రైస్, కోడి గుడ్లు, చికెన్ లేదా రొయ్యలు, ఫిష్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, తేనె, ఆయిల్.

సింగపూర్ ఫ్రైస్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా బాస్మతీ రైస్‌ని నానబెట్టి అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టాలి. చికెన్, రొయ్యలు, ఫిష్‌లను కూడా ముందుగానే ఉడించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ముందుగా ఆయిల్ వేసి గుడ్డు వేసి వేగాక తీసిన పక్కన పెట్టాలి. ఆ తర్వాత చికెన్, రొయ్యలు, ఫిష్ ఇలా మీకు ఇష్టమైన వాటిని కూడా వేసి బాగా వేయించాలి.. ఇవి వేగా వెజిటేబుల్స్ ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి కూడా బాగా వేగాక ఎగ్ వేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టిన బాస్మతీ రైస్ కూడా వేసి అన్నీ ఒకసారి కలుపుతారు. ఇప్పుడు సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, తేనె కొద్దిగా వేసి పెద్ద మంట మీద ఓ పది నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా వేయిస్తూ ఉండాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తారు. అంతే ఎంతో రుచిగా ఉండే సింగపూర్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. చైనీస్ ఐటెమ్స్ పెద్ద మంట మీద చేస్తేనే రుచి బాగుంటుంది. రెసిపీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.

Follow Us
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?