AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు..!

ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. వాతావరణ కాలుష్యం, నీటి వాడకం, టెన్షన్‌, షాంపుల ఎఫెక్ట్‌ తదితర కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. ఈ జుట్టు రాలడాన్ని నిలిపేందుకు మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు..

Hair Care Tips: ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు..!
Hair Care Tips
Subhash Goud
|

Updated on: Jun 16, 2023 | 9:55 PM

Share

ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. వాతావరణ కాలుష్యం, నీటి వాడకం, టెన్షన్‌, షాంపుల ఎఫెక్ట్‌ తదితర కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. ఈ జుట్టు రాలడాన్ని నిలిపేందుకు మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొత్త కొత్త షాంపులను వాడటం, అధిక ధరలకు కొనుగోలు చేసిన ఆయిల్‌ను వాడుతుంటారు. అయితే సమస్య తప్పడం లేదు. కొన్ని విషయాలను పాటిస్తే జుట్టు రాలడాన్ని ఆపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలిపోతుంటే ఆందోళన ఎక్కువైపోతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని ఆపవచ్చని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు.

జుట్టు సంరక్షణలో ఈ తప్పులు చేయవద్దు:

1. వైద్య నిపుణుల ప్రకారం.. జుట్టును జాగ్రత్తగా ఉంచుకోవడంతో కొన్ని తప్పులు చేస్తుంటారని, కొంతమంది తమ జుట్టుకు వారానికి ఒకసారి మాత్రమే షాంపూను వినియోగించి స్నానం చేస్తారని, దాని కారణంగా జుట్టు రాలే ప్రమాదం ఉందంటున్నారు. జుట్టును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, లేని పక్షంలో సమస్య పెరుగుతుందంటున్నారు. అందుకే షాంపూని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వేసవిలో వారానికి కనీసం మూడు సార్లు షాంపూతో జుట్టును కడగాలి.

2. జుట్టు ఎప్పుడు కూడా నిగనిగలాడేలా ఉండాలంటే కెరోటిన్ వాడితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. కెరోటిన్ చికిత్స కొంత సమయం వరకు జుట్టును స్టైలిష్, మెరిసేలా చేస్తుందని, దానికి బదులుగా మీరు హెయిర్ సప్లిమెంట్లను ఉపయోగించవచ్చని వారు సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

3. ఇక వేసవిలో జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండాలంటే ఆయిల్‌ పెట్టుకోవడం చాలా ముఖ్యం. అలాగే హెయిర్ మాస్క్‌లను కూడా అనుసరించాలి. వారానికి కనీసం రెండుసార్లు నూనె, షాంపూ వాడటం మంచిదంటున్నారు. అంతేకాకుండా కలబంధ, నిమ్మకాయ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటిని జుట్టుకు వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. వీటి రసాన్ని పెరుగులో వేసి హెయిర్‌ మాస్క్‌ వేయడం మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి