ఇంట్లో గుగ్గిలం ధూపం వేస్తే ఇన్ని లాభాలా..? తప్పక తెలుసుకోండి..
బాగా ఎండిన తరువాత గట్టి పడుతుంది. ప్రస్తుతం అన్ని పూజా సామాగ్రి దుకాణాల్లో ఈ గుగ్గిలం దొరుకుతుంది. ఎరుపు, తెలుపు రంగుల్లో ఇది కనిపిస్తుంది. ఈ గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల ఇంట్లో పొగ వ్యాపిస్తుంది, ఈ పొగ వల్ల క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. ఈ గుగ్గిలం ధూపం వేసినప్పుడు వచ్చే సువాసన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. చుట్టూ ఉండే గాలిని కూడా శుభ్రపరుస్తుంది.

గుగ్గిలం.. ఇది ఒక చెట్టు నుండి వెలువడే జిగురు.. దీనిని ఇళ్లలో దూపం వేసేందుకు ఎక్కువగా వాడుతుంటారు. వేసవిలో గుగ్గిలం చెట్టు నుండి వచ్చే స్రావాన్ని సేకరించి గుగ్గిలం తయారు చేస్తారు. చెట్టు నుంచి తీసినప్పుడు చాలా జిగురుగా ఉంటుంది. బాగా ఎండిన తరువాత గట్టి పడుతుంది. ప్రస్తుతం అన్ని పూజా సామాగ్రి దుకాణాల్లో ఈ గుగ్గిలం దొరుకుతుంది. ఎరుపు, తెలుపు రంగుల్లో ఇది కనిపిస్తుంది. ఈ గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల ఇంట్లో పొగ వ్యాపిస్తుంది, ఈ పొగ వల్ల క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. ఈ గుగ్గిలం ధూపం వేసినప్పుడు వచ్చే సువాసన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. చుట్టూ ఉండే గాలిని కూడా శుభ్రపరుస్తుంది.
తరచూ ఇంట్లో గుగ్గిలం పొగ వేయటం వల్ల ఆ ఇంట్లో ఉండే నెగేటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. గురువారం నాడు ఇంట్లో గుగ్గిలం ధూపం వేయాలి. గుగ్గిలం వాసన మెదడులోని నొప్పిని, దాని సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. గుగ్గిలం వాసన గుండె నొప్పి నిరోధించేందుకు ప్రయోజనకరంగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గుగ్గిలం ధూపంతో ఇంట్లో కలహాలు కూడా సద్దుమణుగుతాయి. గుగ్గిలం ధూపం అతీంద్రియ లేదా దైవిక శక్తులను ఆకర్షిస్తుందని విశ్వసిస్తారు.
గుగ్గిలం ధూపం ఇవ్వడం వల్ల భూగోళానికి శాంతి కలుగుతుంది. గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గుగ్గిలం సువాసనకు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇళ్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..