వారానికి 150 నిమిషాల ట్రిక్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఎలాగో తెలుసా..?
తాజాగా ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం.. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేయడం ద్వారా ప్రీ డయాబెటిక్ స్థితి నుంచి బయటపడే అవకాశాలు బాగా పెరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనం 2019 నుండి 2023 మధ్యకాలంలో కొలంబియాలో నిర్వహించిన హెల్త్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వేల మందిని పరిశీలించి చేశారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో చాలా మందికి ప్రారంభ దశలో HbA1c స్థాయి సుమారు 5.9 శాతం ఉంది. ఇది సాధారణంగా డయాబెటిస్ పూర్వదశను సూచించే స్థాయి. అయితే వారానికి 150 నిమిషాల కంటే ఎక్కువగా శారీరక శ్రమ చేసిన వారిలో.. చక్కెర నియంత్రణ సాధారణ స్థాయికి చేరుకున్న తీరు నాలుగింతలు ఎక్కువగా కనిపించింది అని పరిశోధకులు పేర్కొన్నారు.
150 నిమిషాల వ్యాయామం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర కండరాలు ఇన్సులిన్ ను బాగా గ్రహించి పనిచేయగలుగుతాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ ను తక్కువ సమయంలో శరీరం గ్రహించేందుకు సహాయపడుతుంది.
- శక్తికి గ్లూకోజ్ అవసరం ఉన్నప్పుడు వ్యాయామం వల్ల శరీరం చక్కెరను ఉపయోగించుకోవడం పెరుగుతుంది. దీంతో బ్లడ్ షుగర్ స్థాయి సహజంగా తగ్గుతుంది.
- బొజ్జ ప్రాంతాల్లో పేరుకుపోయే కొవ్వు రక్తంలో చక్కెరపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వ్యాయామం ఈ కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
- వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ నుంచి బయటపడటానికి బరువు తగ్గడం అవసరం.
- రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల కండరాల సామర్థ్యం పెరుగుతుంది. ఇది చక్కెరను నిల్వ చేసేందుకు కండరాలు సిద్ధంగా ఉండేలా చేస్తుంది.
- అలసట, వాపు లాంటి పరిస్థితులు కూడా డయాబెటిస్ కు కారణాలు కావచ్చు. వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వాపు తగ్గి గ్లూకోజ్ శోషణ బాగా జరుగుతుంది.
- వ్యాయామం వల్ల హై బీపీ తగ్గుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
- శారీరక శ్రమ చేసిన వారిలో నిద్ర బాగా పడుతుంది. దీని వల్ల కార్టిసాల్ లెవల్స్ తగ్గి చక్కెర నియంత్రణ మెరుగవుతుంది.
- వ్యాయామం ఒత్తిడిని తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని ప్రభావం చక్కెర నియంత్రణపై కూడా పడుతుంది.
- జీవనశైలిలో చిన్న మార్పులు ప్రీ డయాబెటిస్ ను నిలిపివేయడమే కాకుండా.. దీర్ఘకాలిక డయాబెటిస్ కి మారకుండా చేస్తాయి. వ్యాయామం వల్ల ఈ ప్రమాదం సగం వరకు తగ్గే అవకాశం ఉంది.
మీరు వారం మొత్తంలో 150 నిమిషాలు వ్యాయామం చేస్తే.. అది మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీనికి పెద్ద పెద్ద పరికరాలు గానీ, జిమ్ కు వెళ్లడం గానీ అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా చేయొచ్చు. సాధారణ వ్యాయామాలైన నడక, జాగింగ్, డ్యాన్స్, సైక్లింగ్ వంటివి చేయడం వల్ల.. మీరు ప్రీ డయాబెటిస్ (షుగర్ వచ్చే అవకాశం ఉన్న దశ) నుంచి బయటపడటానికి చాలా సహాయపడతాయి. నెమ్మదిగా మొదలుపెట్టి.. క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)