Amla Side Effects: ఆరోగ్య సిరి ఉసిరి.. వీళ్లకు మాత్రం వేరీ డేంజర్ గురూ..!
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉసిరి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సర్జరీ చేయించుకోవాలని అనుకున్న వారు కనీసం 2 వారాల పాటు ఉసిరిని తినకూడదు. మధుమేహం ఉన్నవారు ఉసిరి తినాలనుకుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలి. టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉసిరి మంచిదని భావించినప్పటికీ, రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారికి మంచిది కాదు.

ఉసిరి ఎంతో ఆరోగ్యకరమైనది. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల ఇబ్బందులు రావొచ్చు. ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరిని తీసుకుంటే… మరింత తీవ్రతరమవుతుంది. ఉసిరిలో అధిక మొత్తంలో టానిన్లు ఉంటాయి. ఇవి ప్రేగులపై ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు మలబద్ధకానికి దారితీస్తాయి. ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే, అది కడుపు సమస్యలు, విరేచనాలు, డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.
ఉసిరి మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో నిర్జలీకరణ, బరువు తగ్గడానికి కూడా దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉసిరి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సర్జరీ చేయించుకోవాలని అనుకున్న వారు కనీసం 2 వారాల పాటు ఉసిరిని తినకూడదు. మధుమేహం ఉన్నవారు ఉసిరి తినాలనుకుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలి. టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉసిరి మంచిదని భావించినప్పటికీ, రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారికి మంచిది కాదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..