తేనె స్వచ్ఛమైందని గుర్తించడం ఎలా..? సింపుల్ టిప్స్ మీకోసం..
కానీ, నేటి కల్తీ ప్రపంచంలో తేనెను కూడా కల్తీ చేసి విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అందుకే మీరు కొనుగోలు చేసే తేనె స్వచ్ఛమైనదా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మార్కెట్‌లో లభించే నకిలీ, కల్తీ తేనెను తాగితే అది ఆరోగ్యానికి మేలు చేయకపోగా, మరింత హాని కలిగించవచ్చు అంటున్నారు నిపుణులు.. స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రకృతి అందించే అద్భుతమైన ఆహారం తేనె.. అంతేకాదు.. ఇదో దివ్యౌషధం కూడా. ఎందుకంటే తేనెలో అనేక రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడం నుండి శరీరాన్ని శక్తివంతం చేయడం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కానీ, నేటి కల్తీ ప్రపంచంలో తేనెను కూడా కల్తీ చేసి విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అందుకే మీరు కొనుగోలు చేసే తేనె స్వచ్ఛమైనదా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మార్కెట్‌లో లభించే నకిలీ, కల్తీ తేనెను తాగితే అది ఆరోగ్యానికి మేలు చేయకపోగా, మరింత హాని కలిగించవచ్చు అంటున్నారు నిపుణులు.. స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాము.
తేనె స్వచ్ఛతను గుర్తించేందుకు శుభ్రమైన గ్లాసులో నీటిని తీసుకోవాలి. అందులో ఒక చుక్క తేనె వేయాలి. అప్పుడు తేనె దిగువన స్థిరపడినట్లయితే, అది స్వచ్ఛమైనది అని అర్థం. అలాకాకుండా, దిగువకు చేరకముందే నీటిలో కరిగితే ఆ తేనె కల్తీది అని గుర్తించాలి. స్వచ్ఛమైన తేనెలో, ఈగ పడిపోవడం వల్ల చిక్కుకుపోదు. తిరిగి ఎగిరిపోతుంది. స్వచ్ఛమైన తేనెను కళ్లకు రాసుకుంటే కొంచెం మంటగా ఉంటుంది. కానీ జిగురు ఉండదు.
స్వచ్ఛమైన తేనె వల్ల దుస్తులకు మరక చేయదు. స్వచ్ఛమైన తేనె పారదర్శకంగా ఉంటుంది. గ్లాస్ ప్లేట్‌లో తేనె చుక్కలు వేస్తే, దాని ఆకారం పాములాగా మారితే ఆ తేనె స్వచ్ఛంగా ఉన్నట్లే. తేనెను వేడి చేసి లేదా బెల్లం, నెయ్యి, పంచదార, చక్కెర మిఠాయి, నూనె, మాంసం, చేపలు మొదలైన వాటితో తినకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..