Yoga Benefits: సర్వరోగ నివారిణీ యోగా… 30 రోజులు చేశారంటే ఊహించని ప్రయోజనాలు మీ సొంతం..!
యోగాలో భాగంగా ధ్యానం, ప్రాణాయామం వల్ల మానసిక ప్రశాంతతా చేకూరుతుంది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా మారేందుకు దోహదం చేస్తుందని యోగ శాస్త్రనిపుణులు చెబుతున్నారు. వరుసగా 30 రోజుల పాటు యోగా అభ్యాసం చేస్తే మీ శరీరంతో పాటు ఆరోగ్యంలో కూడా మీరు ఊహించని మార్పులను గమనిస్తారు.

శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. రోజూ యోగా సాధన చేయడం ద్వారా రోగాలు దరిచేరవు. యోగాతో ఎలాంటి మానసిక సమస్యలైన తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారను. దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పలు పరిశోధనల్లో తేలింది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కండరాలు బలహీన పడుతాయి. యోగాలో తేలికపాటి ఆసనాలు వేయడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. అలాగే.. ధీర్ఘకాల నొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
యోగా సాధన చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. యోగా, శ్వాస వ్యాయామాలు వల్ల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గి, శ్వాసకోశ కండరాలు బలోపేతమవుతాయి. ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత సాధ్యమవుతుంది. యోగా ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను పెంచడంలో, శారీరక బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అకారణంగా కలిగే కోపం, ద్వేషం లాంటి దరి చేరకుండా ఉంటుంది.
కొందరికి చేస్తున్న పనులపై అస్సలు ఆసక్తి ఉండదు. అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక యోగా మెదడును మెరుగుపరుస్తుంది. యోగా వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని కాపాడుతుంది. వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండటానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. యోగాలో భాగంగా ధ్యానం, ప్రాణాయామం వల్ల మానసిక ప్రశాంతతా చేకూరుతుంది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా మారేందుకు దోహదం చేస్తుందని యోగ శాస్త్రనిపుణులు చెబుతున్నారు. వరుసగా 30 రోజుల పాటు యోగా అభ్యాసం చేస్తే మీ శరీరంతో పాటు ఆరోగ్యంలో కూడా మీరు ఊహించని మార్పులను గమనిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..