చక్కగా కొవ్వును కరిగించే చెక్క.. రోజూ పొద్దున్నే ఇలా తీసుకున్నారంటే రోగాలు పరార్..!
అంతేకాకుండా, దాల్చిన చెక్క నీటితో ఇపీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఇది చర్మానికి మెరుపును తెస్తుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. దాల్చిన చెక్క నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని డీటాక్స్ చేసి మొటిమల నుంచి రక్షిస్తాయి. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి.

మన భారతీయ మసాలా రుచులను సుసంపన్నం చేస్తున్న సుగంధ ద్రవ్యం దాల్చిన చెక్క. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ దాల్చిన చెక్కను వాడుతున్నారు. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు అనేక రోగాలకు చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచే గొప్ప గుణం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం నియంత్రణలో దాల్చిన చెక్క ఉపయోగం అంతాఇంతాకాదు. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ కె, యాంటీ బాక్టీరియల్-యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. దాల్చన చెక్కతో తయారు చేసిన నీటిని తీసుకోవటం వల్ల ఈ లాభాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క నీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాల్చిన చెక్కలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీని వినియోగం కడుపులో గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
దాల్చిన చెక్క నీటిలో ఉండే పాలీఫెనాల్స్, ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వినియోగం జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. దాల్చిన చెక్కలో థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీర వేడిని పెంచడం ద్వారా కొవ్వును కాల్చడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క నీరు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది.
అంతేకాకుండా, దాల్చిన చెక్క నీటితో ఇపీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఇది చర్మానికి మెరుపును తెస్తుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. దాల్చిన చెక్క నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని డీటాక్స్ చేసి మొటిమల నుంచి రక్షిస్తాయి. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..