Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణీకులకు మూడు పూటలా నాణ్యమైన ఉచిత భోజనాన్ని అందించే ఏకైక భారతీయ రైలు ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

ట్రైన్‌లో ఉచిత ఆహారం ఇస్తారని మీకు తెలుసా.. అది కూడా మూడు పూటలు నాణ్యమైన ఆహారం. అవును దేశంలో ఒకే ఒక్క ట్రైన్‌లో మూడు పూటల ఉచిత ఆహారం అందిస్తున్నారు. అదే అమృత్‌సర్‌ నుంచి నాందేడ్‌ మధ్య ప్రయాణించే సచ్ఖండ్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు అమృత్‌సర్ నుండి నాందేడ్ వరకు 33 గంటల సుదీర్ఘ ప్రయాణంలో ప్రయాణికులకు ఉచితంగా మూడు పూటల నాణ్యమైన భోజనం అందిస్తుంది. ఈ సేవ గత 29 సంవత్సరాలుగా కొనసాగుతోంది.

ప్రయాణీకులకు మూడు పూటలా నాణ్యమైన ఉచిత భోజనాన్ని అందించే ఏకైక భారతీయ రైలు ఇదే.. పూర్తి వివరాలు తెలుసుకోండి!
Express Train
Anand T
|

Updated on: Jul 06, 2025 | 7:32 PM

Share

ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో చేరుకునేందుకు సులువైన ప్రయాణ మార్గం రైలు ప్రయాణం. ఎక్కువగా రాకపోకలు సాగించే మార్గాల్లో కొంచెం రద్దీగా ఉండొచ్చేమోగాని.. బెర్తులు దొరికితే ట్రైన్‌ జర్నీలో ఉన్నంత సుఖం మరే ప్రయాణంలో దొరకదు. ఇందులో ఒకే ఒక ఇబ్బంది ఫుడ్‌. ట్రైన్‌లో దొరికే ఫుడ్‌లో క్వాలిటీ లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు ట్రైన్‌లో మూడు పూటల నాణ్యమైన ఆహారం దొరికితే, అది కూడా ఫ్రీగా లభిస్తే.. ప్రయాణికులకు అంతకు మించిన మహాభాగ్యం మరొకటి ఉండదు కదా.. అయినా ట్రైన్‌లో ఎవరు మూడు పూటలు భోజనం పెడతారు అనుకోకండి.. పెడుతున్నారు. ఇక్కడో ట్రైన్‌లో మూడు పూటల ఉచిత, నాణ్యమైన భోజనాన్ని రైల్వేసిబ్బంది ప్రయాణికులకు అందిస్తున్నారు. అదే “సచ్ఖండ్ ఎక్స్‌ప్రెస్”.

దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అవసరమైన సేవలను అందించే ప్రధాన సంస్థ ఇండియన్ రైల్వేస్. ప్రతిరోజూ 2.5 కోట్ల మంది ప్రయాణికులు భారతీయ రైల్వేలో ప్రయాణిస్తారు. అయితే ఇందులో కొన్ని దూర ప్రయాణం సాగించే రైళ్లు తమ ప్రయాణికులకు ఆహారాన్ని అందిస్తాయి. వాటికి కొన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ప్రయాణికులకు నాణ్యమైన భోజనాన్ని అందించే ఏకైక రైలు సచ్ఖండ్ ఎక్స్‌ప్రెస్”. ఈ ట్రైన్‌ అమృత్‌సర్ నుంచి నాందేడ్ మధ్య రాకపోకలను సాగిస్తుంది. గత 29 సంవత్సరాలుగా, ఈ రైలు తన ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తోంది. 33 గంటల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రైలు 39 స్టేషన్లలో ఆగుతుంది, లంగర్ (కమ్యూనిటీ భోజనం) ప్రధానంగా న్యూఢిల్లీ, భోపాల్, పర్భాని, జల్నా, ఔరంగాబాద్, మరాఠ్వాడ వంటి స్టాప్‌లలో అందించబడుతుంది.

ఈ ట్రైన్‌లో అందించే భోజనంలో లిస్ట్‌..

భోజనంలో సాధారణంగా కధి-చావల్, చోలే, పప్పు, కిచిడి, ఆలూ-పట్టా గోభి లేదా ఇతర కూరగాయలు ఉంటాయి. ఈ వంటకాలను స్టేషన్‌ల సమీపంలోని గురుద్వారాలలో తాజాగా తయారు చేస్తారు. అంతే కాకుండా కొందరు స్వచ్ఛంద సేవకులు కూడా ఈ ఆహారాన్ని తీసుకొచ్చి రైల్వే సిబ్బందకి ఇస్తుంటారు. ఇక్కడ ప్రయాణికులకు అందించే అన్ని భోజనాలు ఉచితంగానే ఇస్తారు. గురుద్వారాలకు ఇచ్చే విరాళాల ద్వారా ఈ భోజనాన్ని తయారు చేస్తారు. AC కోచ్‌లతో సహా అన్ని తరగతుల ప్రయాణికులు ఈ ఆహారాన్ని అందిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

.