- Telugu News Photo Gallery Spiritual photos History of Someshwar Mahadev Temple in Raisen at Madhya Pradesh, which is open only for one day every year
Someshwar Mahadev Temple: ఈ భోలేనాథ్ ఆలయ దర్శనం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే.. ఎందుకలా.?
దేశవ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు ఈశ్వరుని పూజలు నిర్వహిస్తూ, దర్శించుకొంటూ ఉంటారు. కానీ చారిత్రాత్మక రైసేన్ కోటపై ఉన్న 12వ శతాబ్దపు సోమేశ్వర మహాదేవ్ శివాలయంలో భోలేనాథ్‌ను పూజించడానికి భక్తులకు ఒక రోజు మాత్రమే అవకాశం లభిస్తుంది. ఇక్కడ శివుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. మరి ఎందుకు ఇలా.? దీని కథంటే.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Jul 07, 2025 | 1:47 PM

మధ్యప్రదేశ్‌లోని రైసేన్‌లో ఉన్న సోమేశ్వర మహాదేవ్ ఆలయం అని కూడా పిలువబడే సోమేశ్వర ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రజలకు తెరిచి ఉండే ఒక ప్రత్యేకమైన శివాలయం. రైసేన్ కోట లోపల ఉన్న ఈ ఆలయం సాధారణం రోజాల్లో మూసివేయబడుతుంది. కానీ మహాశివరాత్రి నాడు, భక్తులు ప్రార్థనలు చేయడానికి, ఆశీర్వాదాలు పొందడానికి ఉదయం కొన్ని గంటలు తెరుచుకొంటుంది.

రాయ్‌సేన్ కోటపై నిర్మించబడిన సోమేశ్వర్ ధామ్ మహాదేవ్ ఆలయం సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే తెరుచుకుంటుంది. ఈ ఆలయాన్ని ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా ధ్వంసం చేశాడని చెబుతారు. సోమేశ్వర్ ధామ్ మహాదేవ్ ఆలయాన్ని 10-11వ శతాబ్దంలో పర్మార్ రాజు ఉదయాదిత్య నిర్మించాడు. ఈ పురాతన శివాలయ నిర్మాణం 11వ శతాబ్దంలో పూర్తయింది. దీని తరువాత, ఆ రాజవంశ ప్రజలు ఇక్కడ క్రమం తప్పకుండా పూజలు చేసేవారు.

1543 వరకు ఈ ఆలయంలో క్రమం తప్పకుండా పూజలు కొనసాగాయి. కానీ రాయ్‌సేన్ రాజు పురాన్మల్ యుద్ధంలో షేర్ షా చేతిలో ఓడిపోయాడు. కోట షేర్ షా ఆధీనంలోకి వెళ్ళింది. షేర్ షా కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించమని ఆదేశించాడు. దీని తరువాత, శివలింగాన్ని తెలివిగా తొలగించి మసీదు నిర్మించారు. కానీ శ్రీ గణేశుడి విగ్రహం. ఇతర చిహ్నాలను గర్భగుడిపైనే వదిలేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1974లో, ప్రజలు ఆలయానికి సంబంధించి పెద్ద ఆందోళన నిర్వహించారు. ఆందోళన తర్వాత, ముఖ్యమంత్రి ప్రకాష్ చంద్ర సేథి స్వయంగా వెళ్లి ఆలయ తాళాన్ని తెరిచారు. దీని తరువాత, ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండటం వల్ల, ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచి ఉంటుంది, మిగిలిన 364 రోజులు ఈ ఆలయం తాళం వేసి ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున భారీ జాతర నిర్వహిస్తారు.

సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి నాడు తెరిచే సోమేశ్వర మహాదేవుని దర్శనం చేసుకోవడానికి వేలాది మంది ఆలయానికి చేరుకుంటారు. సాధారణ రోజుల్లో, భక్తులు ఉదయం 6 గంటలకు 20 అడుగుల పొడవైన పైపు ద్వారా రహస్యంగా శివుడికి నీటిని సమర్పిస్తారు. చారిత్రాత్మక కోటపై ఉన్న 12వ శతాబ్దపు ఆలయం మహాశివరాత్రికి ఈ శివాలయం తాళాలు ఉదయం 6:00 గంటలకు పరిపాలన సమక్షంలో తెరవబడతాయి. సాయంత్రం 6:00 గంటలకు మూసివేయబడుతుంది.




