Mobile Addiction: మీరూ మొబైల్ ఫోన్‌కు బానిసయ్యారా? అయితే ఇలా వదిలించుకోండి..
మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. అధికమంది మొబైల్ ఫోన్‌లతో ఎక్కువ సమయం గడుపుతారు. వీరు మొబైల్ ఫోన్లు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకుంటారు. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు, మొబైల్ ఫోన్‌లతో..

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్య భాగమయ్యాయి. మనలో చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయారు. అధికమంది మొబైల్ ఫోన్‌లతో ఎక్కువ సమయం గడుపుతారు. వీరు మొబైల్ ఫోన్లు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకుంటారు. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు, మొబైల్ ఫోన్‌లతో ఎక్కువ సమయం గడుపుతారు. కానీ ఫోన్‌లను ఎక్కువసేపు చూడటం అంత మంచిది కాదు. మీరు కూడా మీ ఫోన్‌కు బానిసలారా? అయితే ఈ వ్యసనాన్ని ఇలా వదిలించుకోండి.
నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి
మొబైల్‌లో తరచుగా నోటిఫికేషన్‌లు వస్తూనే ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాదాపు అందరూ తమ మొబైల్‌ను పదే పదే చూస్తుంటారు. కాబట్టి నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. ఇలా చేయడం దవ్ఆరా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొబైల్‌ను కూడా ఎక్కువగా చూడటం మానేస్తారు. కాబట్టి మొబైల్ నోటిఫికేషన్‌లను ఆఫ్‌లో ఉంచండి.
అప్లికేషన్ తొలగించండి
మీరు ఎక్కువ సమయం గడిపే మీ మొబైల్ ఫోన్‌లోని అప్లికేషన్‌ను తొలగించండి. ఈ విధంగా కూడా మీరు అధిక మొబైల్ వినియోగాన్ని తగ్గించవచ్చు.
స్క్రీన్ సమయం
రోజంతా మీ ఫోన్ వైపు చూసే బదులు, కొంత సమయం మాత్రమే కేటాయించండి. ఉదాహరణకు ప్రతి రెండు గంటలకు 10 నిమిషాలు మాత్రమే మీ ఫోన్ చెక్ చేసుకోవాలి అనే నియమం పెట్టుకోవాలిజ ఇలా చేయడం ద్వారా మీరు మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ సమయంలో ఫోన్ చూడకండి
కొంతమంది ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్లను చూస్తుంటారు. మీకూ ఈ అలవాటు ఉంటే, ఉదయం నిద్రలేచిన వెంటనేచ భోజనం చేసేటప్పుడు, రాత్రి పడుకునే ముందు మీ ఫోన్ చూడటం మానేయాలి.
మీ ఫోన్‌ను దూరంగా ఉంచండి
మీరు మీ మొబైల్ ఫోన్‌కు దగ్గరగా ఉంటే, మీరు దానిని పదేపదే చూస్తారు. కాబట్టి మీ మొబైల్ ఫోన్‌ను మీకు దూరంగా ఉంచండి. అందుబాటులో లేకుండా చేయండి. ఇలా చేయడం ద్వారా, మీరు మొబైల్ వ్యసనం నుంచి బయటపడవచ్చు.
కొత్త అలవాట్లు
చాలా మంది ఖాళీ సమయం దొరికినప్పుడు తమ మొబైల్ ఫోన్‌లను చేతుల్లో పట్టుకుని సమయం గడుపుతుంటారు. ఇలా చేయడానికి బదులుగా పుస్తకం చదవడం, ఆటలు ఆడటం, డ్రాయింగ్ వేయడం వంటి కార్యకలాపాలతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








