Sneakers: ఇండియాలో కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ స్నీకర్స్ దొరికే ఐదు దేశాలు.. ఇవే!
భారతదేశంలో బ్రాండేడ్ స్నీకర్స్ కొనాలంటే ఓ మధ్యతరగతి ఉద్యోగి తన నెల జీతంలో సగం డబ్బును వాటికోసమే వెచ్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఉండే ధరలు అలా ఉంటాయి. ఇండియాలో స్నీకర్ల ధరలు ఇంత భారీగా ఉండడానికి కారణం దిగుమతి సుంకాలు, పన్నులు. అయితే, కొన్ని దేశాల్లో ఈ స్నీకర్లు మన దేశంలో కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. భారతదేశంతో పోలిస్తే ఏయే దేశాలల్లో తక్కువ ధరకు స్నీకర్స్ అభిస్తాయో తెలుసుకుందాం పదండి.
Updated on: Jul 06, 2025 | 10:08 PM

మొదటగా స్నీకర్స్ తక్కువ ధరకు దొరికే దేశం యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా స్నీకర్ ప్రియులకు స్వర్గం లాంటిది అని చెప్పవచ్చు. ఎంతో పేరుగాంచిన నైక్, అడిడాస్ వంటి బ్రాండ్లు ఇక్కడి నుంచే వచ్చాయి. కాబట్టి వీటి ధర ఇక్కడ తక్కువగానే ఉంటుంది. ఇక్కడే తయారవుతాయి కాబట్టి దిగుమని సుంఖాలు లేకపోవడం కూడా తక్కువ ధరల్లో స్నీకర్స్ లభించేందుకు ఓ కారణం, తరచూ జరిగే సీజనల్ సేల్స్ (బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే) కారణంగా స్నీకర్లు ఇక్కడ భారతదేశంతో పోలిస్తే 20-40% తక్కువ ధరకు లభిస్తాయి. ఉదాహరణకు, ఇండియాలో నైక్ ఎయిర్ మాక్స్ ధర రూ. 10,000-12,000 ఉంటే, అమెరికాలో ఇవి రూ. 6,700-8,400 కు దొరుకుతాయి.

హాంకాంగ్‌లో కూడా స్నీకర్స్ బాగా తక్కువకు దొరుకుతాయంట. ఎందుకంటే హాకాంగ్‌ను టాక్స్ ఉంటుంది. ఇక్కడ స్నీకర్లపై దిగుమతి సుంకాలు, సేల్స్ టాక్సెస్ కూడా ఉండవు. కాజ్‌వే బే, మాంగ్ కాక్ వంటి ప్రాంతాల్లో భారీ స్టోర్స్, ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లు స్నీకర్లను తక్కువ ధరలకు అందిస్తాయి. ఇండియాతో పోలిస్తే ఇక్కడ స్నీకర్లు 15-30% తక్కువ రేటుకు దొరుకుతాయి. ఉదాహరణకు, ఆన్ క్లౌడ్ రన్నర్ స్నీకర్లు ఇండియాలో రూ. 12,000-15,000 ఉంటే, హాంకాంగ్‌లో రూ. 9,000-11,000లకు లభిస్తాయి.

దుబాయ్‌లోనూ స్నీకర్స్ తక్కువ ధరకే దొరుకుతాయి. ఇక్కడ ఉండే ఫ్రీ ట్రేడ్ జోన్‌లు, టాక్స్-ఫ్రీ షాపింగ్ కారణంగా స్నీకర్ల ధరలను ఇండియా కంటే 10-25% తక్కువగా ఉంటాయి. దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వంటి పెద్ద షాపింగ్ మాల్స్‌లో స్నీకర్స్ తక్కవ రేట్‌లో లభిస్తాయి. ఇండియాలో అడిడాస్ ధర రూ. 8,000 ఉంటే, దుబాయ్‌లో రూ. 6,500లకు లభిస్తాయి.

సింగపూర్‌లో తక్కువ జీఎస్‌టీ, సమర్థవంతమైన రిటైల్ మార్కెట్ కారణంగా స్నీకర్ల తక్కువ ధరలకు లభిస్తాయి. ఇండియాతో పోలిస్తే ఇక్కడ స్నీకర్స్ 10-20% తక్కువగా ధరకు దొరుకుతాయి. సింగపూర్‌లోని ఓర్చర్డ్ రోడ్, మరీనా బే షాపింగ్ సెంటర్లలో ఉన్న వివిధ బ్రాండ్ స్టోర్లలో స్నీకర్స్ తక్కువకు దొరుకుతాయి. ఉదాహరణకు నైక్ ఎయిర్ జోర్డాన్ ధర ఇండియాలో రూ. 10,000 ఉంటే, సింగపూర్‌లో రూ. 8,000-9,000 ఉంటుంది.

థాయిలాండ్‌లో స్థానిక ఉత్పత్తి, తక్కువ పన్నుల కారణంగా స్నీకర్ల తక్కువ ధరకు లభిస్తాయి. ఇండియాతో పోలిస్తే ఇక్కడ 15-25% తక్కువగా ఉంటాయి. బ్యాంకాక్‌లోని ఎంబీకే సెంటర్, సియామ్ పారగాన్ వంటి మాల్స్‌లో అడిడాస్, పూమా వంటి బ్రాండ్లు తక్కువ ధరలకు లభిస్తాయి. పూమా స్నీకర్లు ధర ఇండియాలో రూ. 7,000 ఉంటే, థాయిలాండ్‌లో రూ. 5,500-6,000 ఉంటుంది. గమనిక: ధరలు స్టోర్, బ్రాండ్ మరియు సేల్ ఆఫర్లను బట్టి మారవచ్చు. విదేశాల్లో కొనుగోలు చేసేటప్పుడు, టాక్స్ రిఫండ్ ఆప్షన్‌లను తనిఖీ చేయండి.



















