ఎక్కువగా కూర్చునే పని చేస్తున్నారా.. ప్రేగు ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.. జాగ్రత్త సుమా
ప్రస్తుతం శారీరక శ్రమ తక్కువగా ఉన్న ఉద్యోగాలనే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గంటల తరబడి కూర్చునే ఉద్యోగ విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కువ సేపు పని చేస్తూ కూర్చోవడం వలన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. వెన్నునొప్పి నుంచి గుండె ఆరోగ్యం వరకు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయడమే కాదు.. ప్రేగు ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని చెబుతున్నారు.

మీరు రోజులో గంటల తరబడి కుర్చుని పని చేస్తున్నవారు ఎక్కువ అయ్యారు. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. అయితే ఇది సుఖవంతమైన ఉద్యోగం అని అనుకుంటున్నారా.. కాదు అనారోగ్యానికి కారకం అని అంటున్నారు. ప్రతిరోజూ గంటల తరబడి కూర్చోవడం అత్యంత ప్రమాదకరమైన అలవాటు. మనం దీనిని తరచుగా తేలికగా తీసుకుంటాము. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, వెన్నునొప్పి , గుండె ఆరోగ్యం పై మాత్రమే కాదు ప్రేగు ఆరోగ్యం పై కూడా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ , సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సెంథిల్ గణేషన్ ఈ విషయంపై నేటి యువతని హెచ్చరిస్తున్నారు.
పేగు ఆరోగ్యం ఎందుకు ప్రమాదంలో ఉంది?
మన జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడం అనేది పెరిస్టాల్సిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పేగుల కదలిక నెమ్మదిస్తుంది. ఇది ఉబ్బరం, మలబద్ధకం , అసౌకర్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా డాక్టర్ సెంథిల్ గణేషన్ చెప్పిన ప్రకారం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ పేగుల్లో ‘స్తబ్దత’ ఏర్పడుతుంది.ఇది మంటను పెంచుతుంది. మిమ్మల్ని మరింత అలసిపోయేలా చేస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడే బ్యాక్టీరియా ఉన్నందున పేగు శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఈ కండరాలకు అవసరమైన వ్యాయామం లభించదు. అధిక కేలరీలు, అధిక కొవ్వు ఉన్న ఆహారం తిన్న తర్వాత కుర్చుకోవడం పేగు ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం.
పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇలా ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి. కూర్చుని చేసే పని అయినా సరే తరచుగా విరామం తీసుకోవడం.. నీరు త్రాగడం , అధిక ఫైబర్ ఆహారం తీసుకోవడం వల్ల ప్రేగులను కొంతవరకు రక్షించుకోవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. ఒకేసారి 45 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోవద్దు. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడడం.. అటుఇటు కదలడం వంటివి చేయమని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








