AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి ఆలస్యంగా తింటున్నారా… వ్యాధులకు వెల్కం చెబుతున్నట్లే సుమా.. వెంటనే మార్చుకోండి..

నేటి తరం జీవితం ఉరుకులు పరుగులతో సాగుతుంది. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర అన్నిటిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లో ఉద్యోగం చేసేవారు పగలు నిద్ర... రాత్రి తింటి, పని అన్నట్లుగా జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రాత్రి ఆలస్యంగా తినడం.. రాత్రి నిద్ర లేకపోవడం వలన అనేక రోగాల బారిన పడతారాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి 8 గంటల కంటే ముందుగా భోజనం చేయవారు బహు జాగ్రత్త అంటున్నారు. ఎందుకంటే రాత్రి నిద్రపోవడానికి కనీసం రెండు, మూడు గంటల ముందుగా భోజనం తినాలట.

రాత్రి ఆలస్యంగా తింటున్నారా... వ్యాధులకు వెల్కం చెబుతున్నట్లే సుమా.. వెంటనే మార్చుకోండి..
Late Night Eating
Surya Kala
|

Updated on: Oct 08, 2025 | 1:21 PM

Share

మీరు రాత్రి ఆలస్యంగా తింటారా? మీకు ఆకలిని నియంత్రించుకోలేక అతిగా తినే అలవాటు ఉంటే.. వెంటనే ఈ అలవాట్లకు చెక్ పెట్టండి. ఎందుకంటే ఈ అలవాట్లు మీ హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు ద్వారా తెలుస్తుంది. మన ఆహారపు అలవాట్లు గణనీయంగా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశం హార్మోన్ల సమతుల్యత. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహరాన్ని తినడం వలన ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం..

మన హార్మోన్లు మానసిక స్థితి, జీవక్రియతో సహా అనేక శారీరక విధులను నియంత్రిస్తాయి. చాలా మంది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి మందులపై ఆధారపడతారు. అయితే మనం తరచుగా మన ఆహారపు అలవాట్లను విస్మరిస్తాము. ఇవి హార్మోన్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మన ఆహారపు అలవాట్లతో సహా మన రోజువారీ కార్యకలాపాలు హార్మోన్లపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. వాటిలో ఒకటి రాత్రి ఆలస్యంగా తినడం.

ఆహారం తీసుకున్న తర్వాత శరీరంలో ఆహరం జీర్ణం కావడానికి, విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఇలా జరగక పొతే అది మీ హార్మోన్లతో గందరగోళం చెందుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో. అందువల్ల ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

వీలైతే రాత్రి 8 గంటలకు ముందు భోజనం చేయండి. లేదా పడుకునే ముందు కనీసం రెండు మూడు గంటల ముందు తినడం అలవాటు చేసుకోండి. రాత్రి తినే ఆహారంలో కారంగా ఉండే కూరలు, వేయించిన ఆహారాలు, స్వీట్లను పూర్తిగా దూరం పెట్టండి. ఎప్పుడూ రాత్రి తినే ఆహరంలో తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోండి. కొంతమందికి రాత్రి మధ్యలో చాక్లెట్, ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఉంటుంది. ఈ ధోరణి చాలా హానికరం.

ఈ అలవాటు ఒత్తిడిని పెంచుతుంది. కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. పగలు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం వల్ల శరీరం సహజ లయ పునరుద్ధరించబడుతుంది. రాత్రి సమయంలో తినవలసి వస్తే, నానబెట్టిన బాదం లేదా ఏదైనా పండ్లను ఎంచుకోండి. హెర్బల్ టీ తాగడం కూడా చాలా మంచిది. ఆలస్యంగా తినడం .. పడుకోవడం వలన మర్నాడు ఉదయం మీకు బద్ధకంగా అనిపించవచ్చు. కనుక ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోండి.. వ్యాధులకు దూరంగా జీవించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)