దేవుడిచ్చిన వరం దేవకాంచన.. ఫైల్స్ , నోటి సమస్యలకు బెస్ట్ మెడిసిన్.. ఎలా ఉపయోగించాలంటే..
హిందువులు ప్రకృతిని దైవంగా భావించి పూజిస్తారు. మొక్కలు పశుపక్షాదులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మొక్కలను మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. చెట్లు మనకు నీడనిస్తాయి. పండ్లు, కూరగాయలు, నూనెలు, కలప వంటి అనేక వస్తువులను అందిస్తాయి. అంతేకాదు అనేక మొక్కలు ఓషధ గుణాలను కలిగి ఉన్నాయి. అటువంటి మొక్కలలో ఒకటి దేవకాంచన మొక్క. ఆకు, పువ్వు సహా ఈ మొక్కలో ప్రతి భాగం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ఉత్తరాదివారు ఈ పువ్వులతో కూరని చేసుకుని తింటారు కూడా..
Updated on: Oct 08, 2025 | 11:54 AM

దేవకాంచన మొక్కకు ఆయుర్వేద చికిత్సల ముఖ్యమైన స్థానం ఉంది. ముఖ్యంగా 12 ఔషధ ప్రయోజనాలున్న మూలికల మొక్క అని అంటారు. పెద్దగా సంరక్షణ అవసరం లేని ఈ మొక్కను మన దేశంలో ఎక్కడ చూసినా రకరకాల రంగుల్లో కనిపిస్తూ అలరిస్తుంది.

పార్కులు, వీధులు, పెరడు, దేవాలయ ప్రాంగణాలు ఇలా ఎక్కడ చూసినా అందమైన ఆకులతో.. అంతకంటే అందమైన పువ్వులతో కనిపిస్తుంది. ఈ పువ్వులు శివయ్యకు ఇష్టం.. కనుక శివుడి ఈ పువ్వులతో పూజ చేస్తారు. ఈరోజు దేవకాంచన మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో పూర్తి వివరాలను తెలుసుకుందాం.

దేవకాంచన మొక్క ఆర్కిడ్ పువ్వులను పోలి అందంగా ఉంటాయి. దేవకాంచన పువ్వులు ఎరుపు, నారింజ, పసుపు, తెలుపు, ఊదా, గులాబీ, లావెండర్ వాటి రంగుల్లో వికసిస్తాయి. అయితే మనం రెగ్యులర్ గా తెలుపు, లావెండర్, పింక్ వంటి రంగుల పువ్వులనే చూస్తాం.. కొన్ని రంగులు అరుదుగా కనిపిస్తాయి. ఇక చెట్ల ఆకులు కూడా కలిసి ఉంది.. హార్ట్ షేప్ లో అందంగా ఉంటాయి.

దేవ కాంచన మొక్క పువ్వులు, ఆకులు, చెట్ల బెరడు అన్నీ ఔషధ గుణాలుకలిగి ఉన్నాయి. ఆయుర్వేదంలో డయేరియా, చర్మ వ్యాధులు, మధుమేహం, కణితులు, మొలలు వంటిది అనేక వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగిస్తారు.

నోటి దుర్వాసన, పూత వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ చెట్టు బెరడు మంచి మెడిసిన్. ఈ చెట్టు బెరడు ముక్కని కానీ.. బెరడు పొడిని గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యాక నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వలన నోటిపూత తగ్గుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. నోరు ఆరోగ్యంగా ఉంటుంది.

హార్మోన్ల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ చెట్టు బెరడుని ఒక గ్లాసు నీటిలో వేసి గ్లాసు నీరు సగం అయ్యేవరకూ బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిలో పటిక బెల్లం వేసుకుని తాగాలి. ఈ నీరు హార్మోన్లు సమతుల్యం అవుతాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.

మూత్రాశయ సమస్యలతో ఇబ్బంది పడే వారు అంటే మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో ఇబ్బందిపడేవారు ఈ చెట్టు బెరడుని కొన్ని కొన్ని ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి.. సగం నీరు అయ్యే వరకూ మరగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత అందులో పటిక బెల్లం కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వలన మూత్రాశయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అంతేకాదు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్యాటీ లివర్.. కాలేయం వాపు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమస్యలున్నవారు.. ఈ చెట్టు బెరడు కషాయం 10-20 గ్రాములు రోజుకు రెండుసార్లు తాగితే కాలేయ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

దేవకాంచన ఎండిన పువ్వులు పైల్స్ సమస్యకు చక్కటి పరిష్కారం. ఈ చెట్టు పువ్వులను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పూల పొడికి సమాన మోతాదులో పటిక బెల్లం కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని అరచెంచా మోతాదులో రోజుకు రెండుసార్లు తీసుకుంటే మొలలు తగ్గుతాయి.

దేవకాంచన ఆకులతో కషాయం చేసుకుని తాగడం వలన తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసి పుండ్లు, గాయాలు ఉన్నచోట అప్లై చేస్తే అవి తగ్గుతాయి. గజ్జి, దురద, తామర వంటి చర్మ సంబంధిత సమస్యలకు కూడా ఈ ఆకుల రసం చక్కటి మెడిసిన్. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




