Travel India: రొటీన్ లైఫ్ నుంచి రిలీఫ్ కోసం జాబ్ కు గుడ్ బై చెప్పిన జంట.. నచ్చిన ప్రదేశాలు ప్రయాణం చేస్తూనే
ప్రస్తుతం చాలా మందికి జీవితంలో డబ్బు సంపదించడమే లక్ష్యం. దీంతో వయసులో ఉన్నప్పుడు సంపాదన కోసం రాత్రిపగలు అనే తేడా లేకుండా తినడానికి సమయం కూడా కేటాయించకుండా నిరంతరం సంపాదన మీదనే దృష్టి పెడతారు. ఒక వయసు వచ్చిన తర్వాత తిరిగి చూసుకుంటే తన జీవితంలో మధురమైన క్షణాలు లేవు.. ఇష్టమైంది తినలేకపోయారు.. జీవితంలో ఎక్కడికి వెళ్ళలేక పోయాను అంటూ నిత్యం అసంతృప్తితో బాధపడతారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జంట గురించి చర్చ జరుగుతుంది. శ్వేత , చర్చిత్ లకు ప్రయాణం జీవితంలో ఒక భాగం. ప్రయాణాన్ని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి వారు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. రెగ్యులర్ లైఫ్ నుంచి బయటపడి ప్రయాణాన్ని ఇష్టపడే వారికి ఈ జంట గొప్ప ప్రేరణ.

ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రయాణించడం తప్పనిసరి.. కొంత మంది బతుకుదెరువు కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తే.. మరికొందరికి ప్రయాణించడానికి వారి వారి సొంత కారణాలు ఉంటాయి. ప్రయాణాన్ని ఇష్టపడే వ్యక్తులు ప్రపంచాన్ని పర్యటించాలని, కొత్త ప్రదేశాలను చూడాలని, వారి సంస్కృతులను అర్థం చేసుకోవాలని .. వాటికి అనుగుణంగా మారాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు తమకు సమయం దొరికినప్పుడల్లా ఎక్కడో చోటకు ప్రయాణిస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం ఏమిటంటే.. ప్రయాణం చేయడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టిన ఒక జంట గురించి..
శ్వేత, చర్చిత్ లకు ప్రయాణం అంటే చాలా ఇష్టం.. అందుకనే వారి జీవితంలో ప్రయాణం జీవితంలో ఒక భాగం. ప్రయాణ ప్రశాంతమైన అనుభూతిని స్వీకరించడానికి వారు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. తమ బిజీ లైఫ్ నుంచి… వర్క్ సంబంధిత జీవితాల నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని భావించారు. దీంతో ఆరు నెలల పాటు పని నుంచి విరామం తీసుకుంటున్నట్లు ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గత నెల రోజులుగా వారు కలిసి ప్రయాణిస్తున్నారు.
పోస్ట్‌తో పాటు వారు తమ మొదటి నెల ఖర్చుల గురించి వివరణాత్మక గణాంకాలను కూడా పంచుకున్నారు. ఈ జంట రొటీన్ జీవితం నుంచి బయటపడాలని.. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి.. ప్రయాణించడానికి ఇష్టపడే వారికి గొప్ప ప్రేరణ. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ జంట నెలవారీ ఖర్చులను పరిశీలిద్దాం.
View this post on Instagram
జూలై 2025 గణాంకాలు
వసతి- రూ. 23,047
ఆహారం- రూ. 15,525
రవాణా- రూ. 10,921
షాపింగ్ రూ. 7,051 (బట్టలు, ఉపకరణాలు మొదలైనవి)
EMIలు- రూ. 3,232
కార్యకలాపాలు- రూ. 2,747
రీఛార్జ్‌లు, బిల్లులు- రూ. 2,546
వైద్యం, ఆరోగ్యంపై ఖర్చు- రూ. 364
మొత్తం నెలకు ఖర్చు : రూ. 64,343
గణాంకాలతో పాటు.. తాము రోజుకు దాదాపు రూ. 2,000 ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. ఇందులో ఆహారం, వసతి, రవాణా, ఇతర కార్యకలాపాలు ఉన్నాయి. ఎక్కువ డబ్బు వసతి, ఆహారం కోసం ఖర్చు అవుతుంది. అయితే భవిష్యత్ ప్రయాణాలలో ఈ ఖర్చును మరింతగా తగ్గించుకోవాలనుకుంటున్నామని వారు చెబుతున్నారు. ఈ పోస్ట్ చాలా మందికి నచ్చింది. ఈ జంట తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. జీవితం చిన్నది.. ఈ జంట ఈ విషయాన్నీ గుర్తించి తమ జీవితాన్ని వీలైనంత అందంగా మార్చుకుని.. హ్యాపీగా గడుపుతున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








