AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి చెయ్యి పడనిదే.. పప్పులు ఉడకవు..! కేసీఆర్ మెచ్చిన వంటగాళ్లు..!

శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు భోజనాలు వండేవారు ఎక్కడైనా గ్రామానికి ఒకరిద్దరు ఉంటారు. కానీ, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో మాత్రం ఏ ఇంటా చూసిన వాళ్లే కనిపిస్తారు. ఏ కార్యమమైనా వంటలు వండాలంటే ఈ ఊరి వంట మనుషులదే మొదటి ఎంపిక. వీరు చుట్టుపక్కల గ్రామాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించారు.

వీరి చెయ్యి పడనిదే.. పప్పులు ఉడకవు..! కేసీఆర్ మెచ్చిన వంటగాళ్లు..!
Untitled 3
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 08, 2025 | 5:24 PM

Share

శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు భోజనాలు వండేవారు ఎక్కడైనా గ్రామానికి ఒకరిద్దరు ఉంటారు. కానీ, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో మాత్రం ఏ ఇంటా చూసిన వాళ్లే కనిపిస్తారు. ఏ కార్యమమైనా వంటలు వండాలంటే ఈ ఊరి వంట మనుషులదే మొదటి ఎంపిక. గ్రామ జనాభా 2,200 కాగా, వంట చేసేవారు పాతికమంది పైగా ఉన్నారు. మరోవైపు సమీపంలోని తిమ్మాపూర్ తండాలో నలుగురికి పైగా పాకశాస్త్ర ప్రావీణ్యులున్నారు.

60 ఏళ్ల కిందట అలా మొదలైంది.

గ్రామానికి చెందిన రాజేశుని నారాయణ 60 ఏళ్ల క్రితం ఓ దొర దగ్గర వంటలు చేసేవారు. రుచికరంగా చేయడంతో చుట్టు పక్కల గ్రామాల్లో గుర్తింపు వచ్చింది. ఆర్డర్లు అధికంగా రావడంతో నారాయణ తనకు సహాయంగా అయిదుగురు సోదరులను వెంట తీసుకెళ్లేవారు.అలా కుటుంబం మొత్తం వంటల తయారీలో ఆరితేరారు. గ్రామానికి చెందిన ఒకరిద్దరు పాకశాస్త్రంలో ప్రసిద్ధి చెందడంతో ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో, అలాగే పార్టీ సమావేశాల్లో భోజనాలు తయారు చేశారు.

మాజీ సీఎంకు స్వయంగా వడ్డించి..

వీరి దగ్గర పలువురు నేర్చుకోవడంతో గ్రామంతో పాటు తండాలో సుమారు 25 మందికిపైగా వంట చేసేవారు ఉన్నారు. పరోక్షంగా వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఇందులో ప్రణీత్ గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మాంసాహార, శాఖాహార వంటకాలను వండి వడ్డించారు. వీరు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తోపాటు మహారాష్ట్రలో జరిగే శుభకార్యాలకు వంటలకు వెళుతుంటారు. క్వింటాలుకు రూ.5వేల నుంచి రూ.7వేలు వరకు వసూలు చేస్తుంటారు. సీజన్‌లో వంటలు చేస్తూ మిగతా సమయంలో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ నల భీములు..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు