Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 థైరాయిడ్ సమస్యా.. ఈ 3 పండ్లను తినే ఆహారంలో చేర్చుకోవాలి.. వీటిని దూరంగా ఉంచాలి..

థైరాయిడ్ సంబంధిత సమస్యలన్నీ మందు వేసుకోవడం వల్ల వెంటనే తగ్గే  పరిస్థితి కూడా లేదు. హైపోథైరాయిడిజం బరువు పెరగడం, హృదయ స్పందన రేటు మందగించడం,  నిరాశకు కారణంగా మారుతుంది. అప్పుడు మందులు ఒక్కటే తీసుకోవడం సరిపోదు. జీవనశైలిలో కూడా చిన్న మార్పులు చేసుకోవాలి.  థైరాయిడ్‌ సమస్యకు తినడం, తాగడం విషయంలో పరిమితులు లేవు.  అయినప్పటికీ థైరాయిడ్ రోగులు రోజూ తినే ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. కొన్ని ఆహారపు అలవాట్లకు గుడ్ బై చెప్పాలి. 

 థైరాయిడ్ సమస్యా.. ఈ 3 పండ్లను తినే ఆహారంలో చేర్చుకోవాలి.. వీటిని దూరంగా ఉంచాలి..
Fruits For Thyroid
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2024 | 11:40 AM

థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య వస్తే మందులు తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే.. థైరాయిడ్ హార్మోన్ స్రావం, పనితీరు మందుల ద్వారా నిర్వహించబడుతుంది. అయితే థైరాయిడ్ సంబంధిత సమస్యలన్నీ మందు వేసుకోవడం వల్ల వెంటనే తగ్గే  పరిస్థితి కూడా లేదు. హైపోథైరాయిడిజం బరువు పెరగడం, హృదయ స్పందన రేటు మందగించడం,  నిరాశకు కారణంగా మారుతుంది. అప్పుడు మందులు ఒక్కటే తీసుకోవడం సరిపోదు. జీవనశైలిలో కూడా చిన్న మార్పులు చేసుకోవాలి.  థైరాయిడ్‌ సమస్యకు తినడం, తాగడం విషయంలో పరిమితులు లేవు.  అయినప్పటికీ థైరాయిడ్ రోగులు రోజూ తినే ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. కొన్ని ఆహారపు అలవాట్లకు గుడ్ బై చెప్పాలి.

  1. బెర్రీలు: థైరాయిడ్ సమస్యలను నియంత్రించడంలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఇది థైరాయిడ్ పనితీరును చురుకుగా ఉంచుతుంది. మరియు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, క్రాన్బెర్రీస్ వంటి పండ్లు శరీరంలోని యాంటీఆక్సిడెంట్ల లోపాన్ని తీర్చగలవు. ఇవి థైరాయిడ్ వల్ల అలసట, బరువు పెరగకుండా కూడా నివారిస్తాయి.
  2. యాపిల్స్: యాపిల్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. యాపిల్ థైరాయిడ్ గ్రంధిని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. అలాగే మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది.
  3. అవకాడో: బెంగాల్‌లో అవకాడోకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. అవకాడోలో విటమిన్ కే, ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి5, బి6 , విటమిన్ ఇ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాడోలు మంచి సహాయకారి.

ఈ పండ్లను తినడంతో పాటు.. థైరాయిడ్‌ను అదుపులో ఉంచడానికి కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి ఏమిటో తెలుసుకుందాం..

  1. సోయా బీన్స్, సోయా ఫుడ్స్ తినడం వల్ల థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
  2. ఇవి కూడా చదవండి
  3.  థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు తినకపోవడమే మంచిది.
  4. చాలా మందికి కాఫీ లేని రోజు గడవదు. అయితే థైరాయిడ్ సమస్య ఉంటె కాఫీకి దూరంగా ఉండడం మంచిది.
  5. హైపో థైరాయిడిజం సమస్య ఉన్నవారు చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి  బరువు పెరగడానికి కారణం కావచ్చు.
  6. బిస్కెట్లు, పిజ్జా, బర్గర్లు, పాస్తా, ప్రాసెస్ చేసిన మాంసాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. వీటిల్లో  సోడియం ఎక్కువగా ఉంటుంది. కనుక థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు తినవద్దు.
  7.  థైరాయిడ్‌ సమస్య ఉంటె పాలు, పెరుగు, జున్ను, పన్నీరు, వెన్నకు దూరంగా ఉండండి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమని చెప్పవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?