మార్కెట్‌లో ఆరోగ్యాన్ని పాడు చేసే నకిలీ బాదం పప్పు.. దీనిని ఈ 4 పద్దతుల్లో ఈజీగా గుర్తించండి..

బాదంలో కాల్షియం, ఒమేగా 3 పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తినే రైస్ నుంచి పండ్లు, కూరగాయలు ఇలా అన్ని కల్తీ వస్తువులు వస్తున్నట్లు.. మార్కెట్ లో మీ ఆరోగ్యానికి హాని కలిగించే నకిలీ బాదం కూడా మార్కెట్లోకి వస్తోంది. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల శక్తిని అందించడమే కాకుండా గుండె, మెదడు, చర్మం, జుట్టు, ఎముకలు లేదా మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే నకిలీ బాదం తినడం వలన ఆరోగ్య ప్రయోజనానికి బదులు హాని కలుగుతుంది.

మార్కెట్‌లో ఆరోగ్యాన్ని పాడు చేసే నకిలీ బాదం పప్పు.. దీనిని ఈ 4 పద్దతుల్లో ఈజీగా గుర్తించండి..
Almonds
Follow us

|

Updated on: Apr 27, 2024 | 10:17 AM

బాదంపప్పు తినడం వలన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ బాదంపప్పు తినడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది నిజం కూడా.. ఎందుకంటే బాదంలో ఉండే లక్షణాలు  మొత్తం శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడటమే కాదు. దీనిని తినడం వలన మెదడుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాదంలో కాల్షియం, ఒమేగా 3 పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తినే రైస్ నుంచి పండ్లు, కూరగాయలు ఇలా అన్ని కల్తీ వస్తువులు వస్తున్నట్లు.. మార్కెట్ లో మీ ఆరోగ్యానికి హాని కలిగించే నకిలీ బాదం కూడా మార్కెట్లోకి వస్తోంది.

ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల శక్తిని అందించడమే కాకుండా గుండె, మెదడు, చర్మం, జుట్టు, ఎముకలు లేదా మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే నకిలీ బాదం తినడం వలన ఆరోగ్య ప్రయోజనానికి బదులు హాని కలుగుతుంది. కనుక నకిలీ, నిజమైన బాదంను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

బాదంను రుద్దడం ద్వారా తేడా గుర్తించవచ్చు

మార్కెట్లో బాదం కొనుగోలు చేసి ముందు దాని రంగుపై శ్రద్ధ వహించండి. సాధారణ రంగు కంటే బాదం ముదురు రంగులో ఉంటే.. అప్పుడు ఆ బాదం ను టిష్యూ పేపర్‌తో రుద్దండి. నకిలీ బాదంపప్పు రంగు కోల్పోవడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా నిజమైన బాదంను గుర్తించవచ్చు

బాదం ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది మాత్రమే కాదు. దీని నూనెను ఆహారం నుంచి చర్మ సంరక్షణ వరకు ప్రతిదానిలో కూడా ఉపయోగిస్తారు. అసలు, నకిలీ అనే తేడా తెలుసుకోవడనికి బాదం పప్పును పగలగొట్టి, దానిని మీ చేతితో నలగగొట్టండి. నిజమైన బాదం అయితే మీ చేతులకు నూనెను అంటుకుంటుంది. అప్పుడు ఆ చాలా పాతది కాదని .. దానిలో నూనె ఆరిపోలేదని గుర్తించవచ్చు.

రుచి ద్వారా గుర్తించే పద్ధతి

బాదంపప్పులు కొంటున్నట్లయితే దుకాణదారు నుంచి రెండు బాదంపప్పులను తీసుకొని వాటిని రుచి చూడవచ్చు. దాని రుచి నిజమైనదా ..  నకిలీదా అని గుర్తించడంలో సహాయపడుతుంది. అయితే ఈ ట్రిక్‌లో కల్తీ బాదం దొరికే అవకాశం కంటే నాణ్యమైన బాదం ను కనుగొనే అవకాశం ఉంది.

నీటిలో నానబెట్టిన తర్వాత ఆకృతి

బాదంపప్పులను నీళ్లలో నానబెట్టి గిన్నెలో నుంచి తీసిన తర్వాత నీళ్ల రంగు మారిందో లేదో చూసుకోవాలి. బాదం నానబెట్టిన నీటిలో రంగును ఎక్కువగా కనిపిస్తే.. ఆ బాదంపై సింథటిక్ రంగులు ఉపయోగించినట్లు గుర్తించాలి. అయితే అదే సమయంలో నిజమైన బాదం నీటిలో నానబెట్టితే చాలా బాగా ఉబ్బుతుంది.

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇక్కడ ఇచ్చిన సమాచారం,  అవగాహన కోసమే అందించటం జరిగింది. అయితే వీటిని  ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.)