Summer Tour: సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

వేసవి కాలంలో పిల్లలకు ఎక్కువగా సెలవులు ఉంటాయి. దీంతో చాలామంది పలు ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. దీంతోపాటు సొంత గ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. అయితే.. ఎండాకాలంలో ప్రయాణాలు చేసేవారు బ్యాగ్‌లో కొన్ని వస్తువులను దగ్గర ఉంచుకోవడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Prudvi Battula

|

Updated on: Apr 26, 2024 | 9:50 PM

మీరు వేసవిలో ప్రయాణించాలనుకుంటే.. పూర్తి ప్రిపరేషన్‌తో బయలుదేరడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ప్రజలు కొన్ని ముఖ్యమైన వస్తువులను ఇంట్లో ఉంచి, దారిలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణంలో ముందుగా పలు విషయాలపై దృష్టిపెట్టాలి.

1 / 5
సన్‌స్క్రీన్: ఎండలోనే కాదు, వేడి కూడా చర్మాన్ని టాన్ చేస్తుంది. సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం చాలా ముఖ్యం. మీరు విహారయాత్రకు లేదా ప్రయాణాలు చేస్తుంటే ఖచ్చితంగా బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది.

2 / 5
 నీరు: వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువ నీరు తాగడం మంచిది. ప్రయాణంలో మీరు తప్పనిసరిగా కనీసం 2 లీటర్ల నీటిని మీతో తీసుకెళ్లాలి. మీరు శీతల ప్రాంతానికి విహారయాత్రకు వెళుతున్నా ఖచ్చితంగా బ్యాగ్‌లో నీటిని తీసుకెళ్లండి.

3 / 5
కాటన్ దుస్తులు: వేసవిలో ప్రయాణిస్తున్నప్పుడు చెమట పట్టడం సహజం. అలాంటి పరిస్థితుల్లో బిగుతుగా ఉన్న దుస్తులు శరీరంపై దద్దుర్లు లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీరు ప్రయాణంలో ఇలాంటి బాధలకు దూరంగా ఉండాలనుకుంటే మీ బ్యాగ్‌లో కాటన్, తేలికపాటి దుస్తులు మాత్రమే ఉంచుకోండి.

4 / 5
సన్ గ్లాసెస్: ఈ సీజన్‌లో కళ్లపై పడే సూర్యుడి కిరణాలు, వేడి కూడా చెడు ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ ఉంచుకోవడం మర్చిపోవద్దు. సన్ గ్లాసెస్ ధరించడం వల్ల అందంగా కనిపించడంతోపాటు.. ఎండ నుంచి రక్షణ పొందవచ్చు.

5 / 5
Follow us