Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారులను క్రీడాకుసుమాలుగా తయారు చేస్తున్న చైనా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

పాఠశాలలు కూడా చిన్నారుల ప్రతిభకు పదును పెట్టేందుకు గొప్ప కృషిని చేస్తున్నాయి. స్కూల్ లో చిన్నారుల కోసం వివిధ రకాల కార్యకలాపాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది వారి ప్రతిభను మెరుగుపరచడంలో, తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం కొంతమంది చైనీస్ పిల్లల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్లలు బాస్కెట్‌బాల్‌ని ఓ రేంజ్ లో హ్యాండిల్ చేస్తున్నారు.

చిన్నారులను క్రీడాకుసుమాలుగా తయారు చేస్తున్న చైనా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Kindergarten Basketball Training In China (2)
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2024 | 11:44 AM

ప్రతిభకు తెలివి తేటలకు వయసుతో పని లేదు.. చిన్న పిల్లలు కూడా తమ ప్రతిభతో పెద్దలను సైతం ఓడిస్తున్నారు. డ్యాన్స్, ఆట, పాట ఏదైనా సరే పిల్లలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి పదిమందిని ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రతిభ కలిగిన పిల్లలు ఎదో ఒకటి రెండు దేశాల్లో లేరు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించి వావ్ అనిపించుకుంటున్నారు. ఈ విషయంలో పాఠశాలలు కూడా చిన్నారుల ప్రతిభకు పదును పెట్టేందుకు గొప్ప కృషిని చేస్తున్నాయి. స్కూల్ లో చిన్నారుల కోసం వివిధ రకాల కార్యకలాపాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది వారి ప్రతిభను మెరుగుపరచడంలో, తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం కొంతమంది చైనీస్ పిల్లల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్లలు బాస్కెట్‌బాల్‌ని ఓ రేంజ్ లో హ్యాండిల్ చేస్తున్నారు. ఇలా అందరూ చేయలేరు. బాస్కెట్‌బాల్ ఆటను చూసినట్లయితే.. బంతిని మీ వద్ద ఉంచుకుంటూ.. గోల్ పోస్ట్‌కు తీసుకెళ్లడం ఎంత కష్టమో తెలుస్తుంది. అయితే తన మెదడును ఉపయోగించి బాల్ ని గ్రిప్ లో పెట్టుకునేవారు ఈ ఆటలో బాగా రాణిస్తారు. చైనా క్రీడారంగంలో ప్రతిభను కనబరిచేందుకు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అందుకు తగిన శిక్షణ ఇస్తుంది. అందుకు సజీవ సాక్ష్యం ఈ చిన్న పిల్లల వీడియో. చిన్నారులు ఎంత అద్భుతంగా రాణిస్తున్నారో వీడియోలో చూడొచ్చు. వీరికిచ్చిన శిక్షణ చూస్తుంటే పెద్దయ్యాక ఈ క్రీడలో మంచి రు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @gunsnrosesgirl3 అనే IDలో షేర్ చేశారు. చైనాలోని ఒక పాఠశాలలో బాస్కెట్‌బాల్ శిక్షణ పొందుతున్న పిల్లలు అని క్యాప్షన్‌లో చెప్పబడింది. కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 65 వేలకు పైగా వీక్షించగా, 3 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు రకరకాల కామెంట్ చేస్తున్నారు. చైనీయులు ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరచడానికి ఇదే కారణం’ అని ఒక వినియోగదారు రాశారు, కొంతమంది వినియోగదారులు చైనీస్ పిల్లలు కూడా క్రీడలలో చాలా ప్రతిభావంతులని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..