AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రాఫిక్‌లో ఉండే ఆఫీస్ మీటింగ్‌.. వైరల్‌ అవుతోన్న వీడియో..

ట్రాఫిక్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు నగరం. సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ఎన్నో ఐటీ కంపెనీలకు నెలవు. దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగులు ఇక్కడికి ఉద్యోగం కోసం వస్తుంటారు. దీంతో బెంగళూరులో నిత్యం ట్రాఫిక్‌ నరకం ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తుంటుంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడిపే పరిస్థితి వస్తుంది....

Viral Video: ట్రాఫిక్‌లో ఉండే ఆఫీస్ మీటింగ్‌.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Viral Video
Narender Vaitla
|

Updated on: Apr 27, 2024 | 7:35 AM

Share

ఉరుకుల పరుగుల జీవితం. క్షణం ఆగిపోతే వెనకబడిపోతాం అన్న భయం. దీంతో ప్రజలు లైఫ్ అనే రేసులో పరుగెడుతూనే ఉన్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తుంటే జీవితం ఎంత కష్టంగా మారిందో స్పష్టమవుతోంది. ట్రాఫిక్‌ కష్టాలకు సగటు ఉద్యోగి ఎంతటి నరకం అనుభవిస్తారో అర్థమవుతోంది.

ట్రాఫిక్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు నగరం. సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ఎన్నో ఐటీ కంపెనీలకు నెలవు. దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగులు ఇక్కడికి ఉద్యోగం కోసం వస్తుంటారు. దీంతో బెంగళూరులో నిత్యం ట్రాఫిక్‌ నరకం ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తుంటుంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడిపే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలకు అద్దం పడుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ మహిళా ఉద్యోగి ఆఫీసుకని బయలుదేరింది. అయితే అంతలోనే ఆఫీసు మీటింగ్‌కు హాజరుకావాల్సి వచ్చింది. ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వెంటనే తన ఫోన్‌లోనే జూమ్‌కాల్‌లోనే మీటింగ్ జాయిన్‌ అయ్యింది. దీంతో అదే ట్రాఫిక్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో ‘వర్క్‌ ఫ్రమ్‌ ట్రాఫిక్‌.. బెంగళూరులో ఓ సాధారణ రోజు’ అంటూ పోస్ట్ చేశాడు. ఇంకేముందు ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బెంగళూరులో ఇది చాలా కామన్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..