AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visual Puzzle: మీకే ఈ సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నంబర్స్‌ ఏంటో చెప్పగలరా..?

మాస్టర్ గారూ, మేడమ్ గారూ వచ్చేశాం. మీ కోసం కిర్రాక్ పజిల్ తెచ్చేశాం. మీ ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో, మీ అబ్జర్వేషన్ స్కిల్ ఏ మాత్రం ఉందో ఈ పజిల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. సాల్వ్ చేసేద్దాం పదండి... ఈ చిత్రంలోని నంబర్స్ ఏంటో కనిపెట్టండి....

Visual Puzzle: మీకే ఈ సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నంబర్స్‌ ఏంటో చెప్పగలరా..?
Eye Test Puzzle
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2024 | 7:32 AM

Share

ఈ మధ్య పజిల్స్ నెట్టింట భలే ట్రెండ్ అవుతున్నాయి. ఇవి నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి. పజిల్ అంటే మీ తెలుగు నాలెడ్జ్‌కు, తెలివి తేటలకు మాత్రమే కాదండోయ్. మీ అబ్జర్వేషన్ స్కిల్స్, మీ ఐ ఫేకస్ టెస్ట్ చేసే లాంటివి చాలా రకాలు ఉన్నాయ్.  ఈ ఫోటోలో జంతువు ఏంటో కనిపెట్టండి..? ఈ ఫోటోలో పాము ఎక్కడ ఉంది..? ఇచ్చిన ఫోటోలో మీకు కనిపంచే నంబర్స్ ఏంటి.. ఇలా చాలా రకాల పజిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో టైప్ పజిల్ నచ్చుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే.. తెలుగు భాష బాగా వచ్చినవారు..  సుడోకు లాంటి పజిల్స్ లైక్ చేస్తారు. ఇక తమ ఐ ఫోకస్ బాగుంది అనుకునేవారు… ఇందులోని అంకెలు, వస్తువులు, జంతువులు కనిపెట్టండి అనే లాంటి పజిల్స్‌పై ఇంట్రస్ట్ చూపిస్తారు.

ఇప్పుడు మిమ్మల్ని తికమక పెట్టే ఓ పజిల్ తీసుకొచ్చాం. పైన ఉన్న ఫోటోను  బాగా అబ్జర్వ్ చేయండి..? తెలుపు, నలుపు చారలతో గుండ్రంగా ఉంది కదా..? రౌండ్ తిరిగినట్లు అనిపిస్తుంది కదా..! అవును.. అయితే ఆ చిత్రంలో కొన్ని నంబర్స్ ఉన్నాయి. అవి స్పష్టంగా కనిపించడం లేదు. ఆ నంబర్స్‌ను తప్పు లేకుండా చెప్పడమే మీకిచ్చే టాస్క్. తొలుత ఇదే జుజుబీ అని ఫీల్ అవతారు. కానీ సర్కిల్ జిగ్-జాగ్ కారణంగా ఆ నంబర్స్ పట్టేసరికి సరదా తీరిపోతుంది. బహుశా మీరు అతి త్వరగానే “528” లేదా “4528”ని కూడా కనిపెట్టగరు. మిగతా ఎవరు చెప్తారండి మరీ..?.  ఏంటి ఇంకా అక్కడ నంబర్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి. అదే కదా అసలు ట్విస్ట్…

అక్కడ మొత్తం 7 నంబర్స్ ఉన్నాయ్. 20 సెకన్లలో వాటిని కనిపెట్టినవారికి ఐ ఫోకస్..  ఓ రేంజ్‌లో ఉందని ఒప్పుకోవాల్సిందే. సమాధానం కనుగొన్న వారందరూ సూపర్ అంతే. ఇంకా దాని అంతు తేల్చలేకపోయినవారు.. ఇక ఆగిపోండి. ఆన్సర్ మేమే చెప్పేస్తాం. నిశితంగా గమనించండి. అక్కడ ఉన్న సంఖ్యలు.. 3452839. ఈ సారి ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఇంకాస్త ఫోకస్ పెట్టింది. ఈజీగా సమాధానం దొరకుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..