Hair Fall: జుట్టు అధికంగా రాలడానికి కారణం ఈ 4 ఆహారాలే..! అవేంటంటే..?

Hair Fall: పెరుగుతున్న కాలుష్యం, జీవన శైలిలో మార్పుల వల్ల చర్మమే కాదు జుట్టు కూడా రాలుతుంది. పొడిగా, నిస్తేజంగా తయారవుతుంది.

Hair Fall: జుట్టు అధికంగా రాలడానికి కారణం ఈ 4 ఆహారాలే..! అవేంటంటే..?
Hair Fall
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 25, 2021 | 6:55 AM

Hair Fall: పెరుగుతున్న కాలుష్యం, జీవన శైలిలో మార్పుల వల్ల చర్మమే కాదు జుట్టు కూడా రాలుతుంది. పొడిగా, నిస్తేజంగా తయారవుతుంది. అలాగే వెంట్రుకల పెరుగుదల కూడా మందగించి వాటి పతనం కొనసాగుతుంది. జుట్టు రాలడానికి వాతావరణం కూడా ఒక కారణం. నిజానికి జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. చాలా సార్లు జుట్టు దువ్వేటప్పుడు, కడిగిన తర్వాత ఊడిపోతుంది. జుట్టు రాలుతున్న సమయంలో ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోకుండా మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఈ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు జుట్టుకు హానికరం. అయితే వాటికి బదులు హోం రెమెడీస్ చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రజలు తరచుగా కొన్ని ఆహారాలను తీసుకుంటారు. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

1. అధిక చక్కెర అధిక చక్కెర ఆరోగ్యానికి హానికరం. నివేదికల ప్రకారం చక్కెరను అధికంగా తీసుకుంటే అది బట్టతలకి కారణం అవుతుంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. మీ ఆహారంలో చక్కెరను తగ్గించే దినచర్యను ఈరోజు నుంచే ప్రారంభించండి.

2. సోడా డైట్ సోడాను అధికంగా ఉపయోగించడం జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అందులో అస్పర్టమే అనే కృత్రిమ చక్కెరను కలుపుతారు. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుందని పరిశోధనలో తేలింది.

3. మద్యం కెరాటిన్ అనే ప్రోటీన్ జుట్టులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఆల్కహాల్ ప్రోటీన్‌ను ప్రభావితం చేస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాదు ఆల్కహాల్ వల్ల శరీరంలో చాలా పోషకాలు లోపిస్తాయి.

4. చేప వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ రోజుల్లో చేపల్లో పాదరసం పరిమాణం పెరిగిందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఈ పాదరసం చేపల ద్వారా మనలోకి చేరుతుంది ఇది జుట్టు రాలడం సమస్యను కలిగిస్తుంది.

80 దేశాల్లో 1512 స్క్రీన్‌లలో విడుదలైన 83 చిత్రం.. భారీ వసూళ్ల దిశగా పరుగులు..

RBI: ఆ బ్యాంకుపై ఆర్బీఐ 30 లక్షల జరిమానా.. రెండు సహకార బ్యాంకులపై చర్యలు.. ఎందుకంటే..?

ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పీఎఫ్ అమౌంట్‌ పెరిగే అవకాశం.. వేతన సరళిలో మార్పులు