Beauty Care: మీ మోము మిలమిల మెరవాలనుకుంటున్నారా? అయితే ఈ వేపతో తయారుచేసిన ఫేక్ ఫ్యాక్ లు ట్రై చేయండి..
పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్యంపైనే చర్మంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ముఖంపై దద్దుర్లు , మొటిమలు (pimples and acne) ,ముడతలు తదితర చర్మ సంబంధిత సమస్యలు కలుగుతాయి

పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్యంపైనే చర్మంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ముఖంపై దద్దుర్లు , మొటిమలు (pimples and acne) ,ముడతలు తదితర చర్మ సంబంధిత సమస్యలు కలుగుతాయి. చాలామంది వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో దొరికే రకరకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అయితే వీటివల్ల చేకూరే ప్రయోజనాల సంగతి పక్కన పెడితే దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండడమే మేలని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు. వీటికి బదులు వేప, కలబంద లాంటి సహజ పదార్థాలను ఉపయోగించాలంటున్నారు. అదేవిధంగా సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో విటమిన్- ఇ కూడా సమృద్ధిగా దొరుకుతుంది. చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉండాలంటే వేప ఆకులను ఉపయోగించవచ్చు. మరి వేపతో ముఖారవిందాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం రండి.
జిడ్డు చర్మం ఉందా?
జిడ్డు చర్మం ఉన్నవారు వేప, తేనెతో కలిపిన ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం 10 నుంచి 12 వేప ఆకులను గ్రైండ్ చేసి, దానికి ఒక చెంచా తేనె కలిపి మెత్తగా పేస్ట్‌లాగా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతులతో ముఖంపై మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖంపై తరచూ అప్లై చేయడం వల్ల జిడ్డు చర్మం తొలగిపోతుంది. అదేవిధంగా ముఖం మెరుపును సంతరించుకుంటుంది.
వేప, శెనగ పిండి
ఈ ప్యాక్ చేయడానికి, రెండు టీస్పూన్ల శెనగపిండిలో ఒక టీస్పూన్ రోజ్ వాటర్, అర టీస్పూన్ వేప పొడి కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత పరిశుభ్రమైన నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
వేప, కలబంద
కలబందలో చర్మ సంరక్షణకు సంబంధించిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద రసాన్ని, వేపాకులతో కలిపి పేస్ట్ లాగా తయారుచేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే చర్మం హైడ్రేట్ గా తయారవుతుంది. ఇందుకోసం రెండు చెంచాల అలోవెరా జెల్‌లో ఒక చెంచా వేప పొడిని కలపండి. సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖం కడిగేయాలి. వేపలో ఉండే గుణాల వల్ల చర్మంపై ఉండే మొటిమలు తొలగిపోతాయి. మీరు వారానికి రెండుసార్లు ఈ మాస్క్‌ని ముఖానికి అప్లై చేసుకోవచ్చు.
Also Read:Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
UP Assembly Election 2022: యూపీ ఎన్నికలు.. ఓటర్లకు అఖిలేష్ ఇచ్చిన ఆ హామీ గేమ్ ఛేంజర్ కానుందా?
Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..
