IRCTC Tour: విశాఖ నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే..
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోన్న సంగతి తెలుస్తుందే.
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోన్న సంగతి తెలుస్తుందే. అలా తాజాగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ప్రసిద్ధ మాతా వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకునాలనే భక్తలకు ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam) నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీలో మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శనతో పాటు పంజాబ్‌లోని అమృత్‌సర్, ధర్మశాల లాంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక మే 22న ప్రారంభం అవుతుంది.
యాత్ర సాగుతుందిలా..
మొదటి రోజు ఉదయం 7.55 గంటలకు భక్తులు విశాఖపట్నంలో విమానం ఎక్కాలి. 10.20 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అదే రోజు ఢిల్లీలో సాయంత్రం 5.25 గంటలకు మరో విమానం ఎక్కితే సాయంత్రం 6.40 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటారు. హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. ఆ రాత్రికి అమృత్‌సర్‌లోనే బస ఉంటుంది. రెండో రోజు ఉదయం జలియన్‌వాలా బాగ్ సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత వాఘా బార్డర్‌ను దర్శించకోవచ్చు. మూడో రోజు ధర్మశాలకు బయల్దేలి అక్కడి పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఆ రాత్రికి ధర్మశాలలో బస చేయాలి. నాలుగో రోజు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. టిబెటియన్ మొనాస్ట్రీ, క్రికెట్ స్టేడియం, భగ్సునాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఐదో రోజు కాట్రాలో సైట్ సీయింగ్ ఉంటుంది. ఇక ఆరో రోజు వైష్ణో దేవి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కాట్రాకు బయల్దేరాలి. ఏడో రోజు జమ్మూకు బయల్దేరాల్సి ఉంటుంది. రఘునాథ్ మందిర్ సందర్శన ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4.25 గంటలకు జమ్మూ ఎయిర్‌పోర్టులో విమాపం ఎక్కితే 5.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీలో రాత్రి 7.25 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ధరలు ఎలా ఉన్నాయంటే..
ఐఆర్‌సీటీసీ మాతా వైష్ణోదేవీ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.31,760గా ఉంది. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.32,675 చెల్లించాలి. ఇక సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.42,100 ఖర్చవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలోనే ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, భోజనాలు, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి.
Travel to the holy abode of #MataVaishnoDevi in the mountains of #Trikuta and also visit other places in #Amritsar and #Dharamshala. Flight leaves on 22nd May’22. Hurry! Book today on https://t.co/t25YWbOCLT@AmritMahotsav
— IRCTC (@IRCTCofficial) February 21, 2022
Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
Smart Phone: స్కూల్స్‌కు స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చిన స్టూడెంట్స్.. మంటల్లో వేసిన టీచర్ ఎక్కడంటే..