Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారఫలాలు.. వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

Weekly Horoscope: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు...

Weekly Horoscope: వారఫలాలు.. వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 27, 2022 | 7:05 AM

Weekly Horoscope: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు(horoscope) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ఇక వారం మొత్తంలో తమతమ రాశి ఎలా ఉంటుందని తెలుసుకుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 05 వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేషం

ఈ రాశి వారికి ఈ వారం ఉత్తమ కార్యాచరణ మేలుచేస్తుంది. ఆత్మబలం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగం అనుకూలం. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలను అధిగమించాలి. ఆర్థిక సమస్యలు తీరతాయి. సమాజంలో పేరు సంపాదిస్తారు. పరోపకార ప్రయత్నం చేయండి. వివాదాలకు అవకాశముంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు విషయాలలో ఆసక్తికరమైన ఆఫర్లు లభిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఉంటాయి.

వృషభం

ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. ఏదైనా కళ్లతో చూసిన వెంటనే దానిని నమ్మడం సరికాదు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది. పనుల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు సానుకూల ఫలితాలనిస్తాయి. భవిష్యత్తు కోసం శ్రమించండి. సహనంతో జయం కలుగుతుంది. ముఖ్యకార్యాలను ఏకాగ్రచిత్తంతో పూర్తిచేయాలి. సంకుచిత భావాలకు దూరంగా ఉండాలి. పెద్దల సలహా అవసరం.

మిథునం

ఈ రాశి వారికి ఈ వారం అదృష్టయోగముంది. ఉద్యోగంలో బాగుంటుంది. కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. సాధించాల్సిన అంశాల్లో పురోగతి ఉంటుంది. తెలియని సమస్య ఒకటి మనసును పీడిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. డబ్బు ఆదా చేయడం భవిష్యత్తులో మద్దతునిస్తుంది.

కర్కాటకం

కాలం సహకరించటం లేదు. శాంతంగా ఆలోచించాలి. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ప్లాన్ మీ ముందుకు రావచ్చు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన గొప్పవారిని చేస్తుంది. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తీవ్రమైన స్థితి గోచరిస్తోంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. మొహమాటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సున్నితంగా సంభాషించండి.

సింహం

ఈ వారం ఈ రాశి వారికి అద్భుతమైన గ్రహస్థితి ఉంది. మీ కర్తవ్యాలను సమర్థతతో పూర్తిచేయండి. పదోన్నతులూ ప్రశంసలూ ఉంటాయి. ఖర్చులు ఉన్నా వ్యాపారంలో అభివృద్ధీ ఉంటుంది. మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వేగంగా పనిచేస్తే మరిన్ని లాభాలొస్తాయి. కుటుంబసభ్యులతో చర్చలు ధైర్యాన్నిస్తాయి. మీ ప్రసంగం మధురంగా ఉంటుంది. దీని కారణంగా మీరు ఇతరులను మీ వైపుకు ఆకర్షిస్తారు.

కన్య

ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో అధికార లాభం సూచితం. సమస్య ఒకటి తొలగుతుంది. సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఉత్సాహంగా పనులను పూర్తిచేయాలి. వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. మాటల్లో స్పష్టత, పనిలో నిజాయతీ అవసరం. ధర్మదేవతానుగ్రహం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఏదైనా పాత నష్టాన్ని కూడా భర్తీ చేయవచ్చు. సామాజిక జీవితంలో భాగస్వామ్యం పెరుగుతుంది.

తుల

అనుకూల కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి మనసుతో పని ప్రారంభించండి. గుర్తింపూ సహకారం లభిస్తాయి. పెద్దల ప్రోత్సాహముంటుంది. పనులు త్వరగా అవుతాయి. ఆనందించే అంశాలున్నాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీరు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో బాగుంటుంది. కోరికలు నెరవేరతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లండి. చెడు ఊహించవద్దు. కుటుంబసభ్యుల సూచనలు పనిచేస్తాయి. భారీ లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది.

ధనుస్సు

శుభకాలం నడుస్తోంది. కాలయాపన లేకుండా మొదలుపెడితే ఉత్తమ కార్యాలు సాధిస్తారు. ఉద్యోగంలో మంచి స్థితి గోచరిస్తోంది. శత్రుదోషం తొలగుతుంది. వ్యాపారం అద్భుతం. పలుమార్గాల్లో విశేషమైన లాభాలుంటాయి. అంచెలంచెలుగా పైకి వస్తారు. సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు మీ స్నేహితులు, పరిచయస్తులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

మకర

ఈ రాశి వారికి ఈ వారం లక్ష్యం నెరవేరుతుంది కానీ శ్రమ ఉంటుంది. అభివృద్ధికి అవసరమైన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నాయి. ఆర్థిక నష్టాలకు అవకాశముంది. తెలివిగా వ్యవహరించాలి. మొహమాటం వల్ల ఇబ్బందులుంటాయి. గృహలాభం గోచరిస్తోంది. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మంచి పర్యటనను కలిగి ఉంటారు.

కుంభ

చక్కని ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరండి. సంతృప్తికరమైన విజయం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఓర్పు మిమ్మల్ని కాపాడుతుంది. దేనికీ ఆవేశపడవద్దు. ఆత్మీయుల సలహాలు అవసరం. సొంత నిర్ణయాలు కొంత శ్రమ కలిగిస్తాయి. సమష్టి కృషితో పని పూర్తిచేయండి. మీరు కుటుంబ ఆస్తి నుండి చాలా లాభపడతారు. మీ కృషి, అవగాహన అనేవి మీ జీవితం సంతోషంగా ఉండటానికి సహాయం చేస్తాయి.

మీనం

శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. కార్యసిద్ధి ఉంటుంది. అధిక గ్రహాలు అనుకూలిస్తున్నాయి. పలుమార్గాల్లో లాభపడతారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. దేనికీ సంకోచించవద్దు. మంచి మనసుతో చేసే ప్రతి పనీ మంచి ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఆహ్లాదకరమైన వార్తల ప్రాధాన్యత మీకు మిగిలి ఉంటుంది. అదృష్టం ఈ రోజు మీకు 92 శాతం మద్దతు ఇస్తుంది.