Banana History : అరటిపండు వంకరగా ఉండటానికి కారణం ఏంటి..! చరిత్ర తెలుసుకోండి..
Banana History : అరటి అనేది శక్తితో కూడిన ఒక పండు. ఇది దాదాపు ప్రతి సీజన్‌లో దొరుకుతుంది. అంతేకాదు చాలా చవకైనది ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయవచ్చు.
Banana History : అరటి అనేది శక్తితో కూడిన ఒక పండు. ఇది దాదాపు ప్రతి సీజన్‌లో దొరుకుతుంది. అంతేకాదు చాలా చవకైనది ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయవచ్చు. కానీ ఎప్పుడైనా దాని ఆకృతిని గమనించారా? అది ఎందుకు వంకరగా ఉందని ఆలోచించారా.. దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. దాని గురించి తెలుసుకుందాం.ప్రారంభంలో చెట్టు పై అరటి పండు పుష్పగుచ్ఛాలతో ఉంటుంది. ఇది ఒక మొగ్గ లాంటిది. స్థానిక భాషలో గెల అంటారు. ప్రారంభంలో అరటి నేల వైపు పెరుగుతుంది అంటే అది సూటిగా ఉంటుంది. తర్వాత నెగటివ్ జియోట్రోపిజం వల్ల వంకరగా మారుతాయి. అంటే సూర్యుని వైపు పెరిగే చెట్లు అని అర్థం. ఈ కారణంగా అరటి ఆకారం వంకరగా మారుతుంది. పొద్దుతిరుగుడు కూడా ఇదే విధమైన మొక్క.
ఇది ప్రతికూల జియోట్రోపిజం కలిగి ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు ఎల్లప్పుడూ సూర్యుని ఉదయించే దిశలో ఉంటుంది. సాయంత్రం సూర్యుడు తన దిశను మార్చుకున్నప్పుడు, పొద్దుతిరుగుడు పువ్వు కూడా దాని దిశను మార్చుకుంటుంది. అందుకే ఈ పువ్వు పేరు పొద్దుతిరుగుడు అంటే సూర్యుని వైపు ముఖం గలదని అర్థం. బొటానికల్ హిస్టరీ ఆఫ్ అరటి ప్రకారం.. అరటి చెట్లు మొదట వర్షారణ్యం మధ్యలో జన్మించాయి. అక్కడ సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి పెరగడానికి చెట్లు అదే వాతావరణానికి అనుగుణంగా తమను తాము మార్చుకున్నాయి.
సూర్యరశ్మి వచ్చినప్పుడల్లా అరటిపండ్లు సూర్యుని వైపు కదలడం ప్రారంభించాయి. అందువల్ల అరటి ఆకారం వంకరగా మారింది. అది మొదట భూమి వైపు తరువాత ఆకాశం వైపు తిరుగుతుంది. అరటిని మతపరమైన కోణం నుంచి చాలా పవిత్రమైన పండ్లుగా భావిస్తారు. అరటి చెట్టును చాణక్య అర్థశాస్త్రంలో కూడా ప్రస్తావించారు. అరటి చిత్రాలు అజంతా-ఎల్లోరా కళాఖండాలలో కూడా కనిపిస్తాయి. అందుకే అరటి చరిత్ర చాలా పాతది. అరటిపండు 4000 సంవత్సరాల క్రితం మలేషియాలో పెరిగిన తరువాత ప్రపంచమంతా వ్యాపించిందని నమ్ముతారు. ప్రస్తుత కాలంలో అరటిపండ్లను 51% అల్పాహారంలో మాత్రమే తింటారు.