AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dates Halwa Recipe: తక్షణ శక్తినిచ్చే ఆహారం ఖర్జూరం.. ఈజీగా టేస్టీగా డేట్స్ హల్వా తయారీ విధానం..

Dates Halwa Recipe: మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా ఖ్యాతిగాంచింది ఖర్జూరం. ఒకప్పుడు ఇది అక్టోబరు - డిసెంబరు సమయంలో మాత్రమే..

Dates Halwa Recipe: తక్షణ శక్తినిచ్చే ఆహారం ఖర్జూరం.. ఈజీగా టేస్టీగా డేట్స్ హల్వా తయారీ విధానం..
Dates Halwa
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 16, 2021 | 12:18 PM

Share

Dates Halwa Recipe: మనిషికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా ఖ్యాతిగాంచింది ఖర్జూరం. ఒకప్పుడు ఇది అక్టోబరు – డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఏడాదిలో అన్ని రోజులు దొరుకుతుంది. ఎక్కడ ఏ సూపర్‌ మార్కెట్టుకెళ్లినా ఖర్జూరం గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసినవి ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.ఖర్జూరాన్ని వివిధ దేశాలు వివిధ రకాలు ఉపగయోగిస్తున్నాయి. కొన్ని దేశాలవారు తినే ఆహారంలో భాగం చేసుకుంటే.. మరికొన్ని దేశాలు బీరు, షాంపేన్‌ లాంటి పానీయాన్ని తయారు చేస్తున్నాయి.. ఈరోజు మనం ఖర్జూరంతో హల్వా తయారు విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

ఖర్జూరం – 2 కప్పులు నెయ్యి – 1 కప్పు కార్న్ ప్లోర్ – 2 టేబుల్‌ స్పూన్లు, పాలు సరిపడినన్నీ జీడిపప్పు కిస్మిస్ బాదాం పప్పు యాలకుల పొడి – పావు టీ స్పూన్‌ పంచదార లేదా బెల్లం – మూడు స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా ఖర్జూరం లోని గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి.. తర్వాత వాటిని ఒక కప్పు లో వేసుకుని వేడి నీరు వేసి నానబెట్టుకోవాలి. మరోవైపు కార్న్ ప్లోర్ లో నీరు పోసుకుని ముద్దలు లేకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. స్టౌ మీద దళసరి గిన్నె పెట్టి.. దానిలో ముందుగా నెయ్యి వేసి.. జీడిపప్పు, బాదాం పప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో పాలు పోసుకుని.. వేడి ఎక్కిన తర్వాత ఆ పాలల్లో ఖర్జురాన్ని వేసి సన్నని మంటపై ఉడికించుకోవాలి. తర్వాత పంచదార లేదా బెల్లం , యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత కార్న్ ప్లోర్ వేసి బాగా కలపాలి.. దగ్గర పడే సమయం నుంచి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ.. ఆ మిశ్రమాన్ని సన్నని మంటపై ఉండికించాలి. హల్వా మొత్తం దగ్గరగా అయ్యి.. నెయ్యి పట్టి.. ఆ మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా వస్తుంది.. అప్పుడు స్టౌ ఆఫ్ చేసుకుని.. ఒక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లోకి తీసుకుని ఖర్జూరం హల్వా తీసుకుని.. సమానంగా పరచాలి.. ఒక అరగంట తర్వాత ఖర్జూరం హల్వా చల్లారుతుంది. అప్పుడు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవాలి. అంతే ఎంతో శక్తిని ఇచ్చే ఖర్జూరం హల్వా రెడీ..

రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ఖర్జూరం శక్తినిచ్చే ఆహారమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా యిస్తుంది. ఖర్జూర తినడము వలన మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలు బలంగ తయారవుతాయి, ఉదర క్యాన్సర్ తగ్గుతుంది. ఖర్జూర పండు అధిక ఇనుము కలిగి ఉంటుంది. అందువలన ఇది రక్తహీనత తగ్గించడములో సహాయపడుతుంది.

Also Read: మొక్కజొన్న చినుకులు పడే సమయంలో ఆస్వాదించడానికే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది..