Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Corn: మెుక్కజొన్న చినుకులు పడే సమయంలో ఆస్వాదించడానికే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది..

Benefits of Corn: మెుక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. చిరు చినుకులు పడుతుంటే.. వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తినడానికి మనసు పరుగు..

Benefits of Corn: మెుక్కజొన్న చినుకులు పడే సమయంలో ఆస్వాదించడానికే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది..
Corn
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jul 16, 2021 | 1:36 PM

Benefits of Corn: మెుక్కజొన్న గురించి తెలియని వారు ఉండరు. చిరు చినుకులు పడుతుంటే.. వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తినడానికి మనసు పరుగు పెడుతుంది. మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండె ను నిప్పుల మీద వేడి వేడి గా కాల్చుకుని కమ్మగా తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం.. అవి ఏమిటో తెలుసుకుందాం..

* మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. *మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ ను అరికడుతుంది. *ఎముకల బలానికి పోషకాలైన కాపర్ ఐరన్ ఇంకా అవసరమైన లవణాలు, మినరల్స్ అన్ని మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి. *పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా మొక్కజొన్నలో ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో మొక్కజొన్నలు ఎంతగానో ఉపయోగపడతాయి. *మెుక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమేకాదు.. శరీరంపై ముడతలు రాకుండా చేస్తుంది. *మెుక్కజొన్న గింజల నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది. *రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరం. మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల వృద్ధి చేస్తుంది. *మొక్కజొన్న రక్తకణాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు పక్షవాతం బీపీ మొదలైన వాటి సమస్యలు అదుపులో ఉంచుతుంది. *రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉండేలా చేస్తుంది. *మొక్కజొన్న తక్షణ శక్తిని ఇచ్చే ఆహారపదార్ధం. దీనిని తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు పోషకాల శాతం కూడా ఎక్కువగానే *మొక్కజొన్న తరచుగా తినడం వల్ల హైపర్టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ షుగర్ గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. అందుకే వర్షాకాలంలో సరదాకి తినడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే మొక్క జొన్నను మీ ఆహారంలో భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి.

Also Read: మూడుసార్లు జాతీయ అవార్డు విన్నర్.. చిన్నారిపెళ్లి కూతురు ఫేమ్ సురేఖ సిక్రీ గుండెపోటుతో మృతి..