Kidney Detox : ఇంట్లోనే ఈ పద్దతుల ద్వారా మీ మూత్రపిండాలను శుభ్రం చేసుకోండి..
Kidney Detox : మానవ శరీరం సరిగ్గా పనిచేయడానికి మూత్రపిండాలు ఎంతో దోహదపడుతాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని, వ్యర్థ ఉత్పత్తులను బయటకు పంపించడానికి
Kidney Detox : మానవ శరీరం సరిగ్గా పనిచేయడానికి మూత్రపిండాలు ఎంతో దోహదపడుతాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని, వ్యర్థ ఉత్పత్తులను బయటకు పంపించడానికి సహాయపడుతాయి. మూత్రపిండాలు వాటి పనిని సరిగ్గా చేయాలంటే ఎక్కువ నీరు తాగటం అవసరం. టాక్సిన్ల వల్ల కొన్నిసార్లు కిడ్నీలు దెబ్బతింటాయి. అటువంటి పరిస్థితిలో మూత్రపిండాలు సరిగా పనిచేయవు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో మూత్ర పిండాలను శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
1. టీ – మూత్రపిండాలను శుభ్రపరచడంలో టీ సహాయపడుతుంది. మీరు ఒక కప్పు టీని ఆస్వాదించవచ్చు. అదే సమయంలో అది మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడానికి టీ సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు రకరకాల టీలను తాగవచ్చు. కానీ ఎక్కువగా తాగితే అనర్థాలు తప్పవు.
2. చెర్రీస్, క్రాన్బెర్రీస్ – ప్రతి ఒక్కరూ చెర్రీస్, క్రాన్బెర్రీస్ రుచిని ఇష్టపడతారు. మీరు వాటిని మీ డైట్‌లో చేర్చవచ్చు. రెండు వారాల పాటు చెర్రీస్, క్రాన్బెర్రీస్ తీసుకోవడం వల్ల యుటిఐ లక్షణాలు తగ్గుతాయి. మీరు వాటిని ఏ రూపంలోనైనా తినవచ్చు. వాటిని స్మూతీస్, సలాడ్లలో రూపంలోనైనా తీసుకోవచ్చు. చెర్రీస్, క్రాన్బెర్రీస్ మీకు తగినంత యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి అనేక వ్యాధులను అరికట్టడానికి సహాయపడతాయి.
3. ఫ్రూట్ జ్యూస్ – చక్కెర లేదా ఉప్పు లేకుండా జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జ్యూస్ సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. మీరు నిమ్మ, నారింజ లేదా పుచ్చకాయ రసం తాగవచ్చు. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రసం మూత్రపిండాలలో రాళ్ల పెరుగుదలను నిరోధిస్తుంది. మీరు ఆలోచించకుండా మీ రోజువారీ ఆహారంలో ఈ రసాలను చేర్చవచ్చు.
4. బచ్చలికూర – ఆకుకూరలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ ఆకు కూరలను మీ ఆహారంలో చేర్చడం మంచిది. బచ్చలికూరలో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడానికి సహాయపడతాయి. మెరుగైన మూత్రపిండాల ఆరోగ్యం కోసం మీరు బచ్చలికూరను మితంగా తీసుకోవాలి. బచ్చలికూర ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్ల ప్రమాదం పెరుగుతుంది.